అపోలో హాస్పిటల్‌లో డాక్టర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో ఇతర జాబ్స్ చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా కెరీర్ బిగినింగ్ లో డాక్టర్ గా చేసింది.. ఆతర్వాత నటిగా మారింది.

అపోలో హాస్పిటల్‌లో డాక్టర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్
Actress

Updated on: May 27, 2025 | 6:35 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది కోట్లు కూడబెడుతున్నారు. మరి కొంతమంది మాత్రం కనిపించకుండా పోతున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి సక్సెస్ అవుతున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారింది. అంతే కాదు తన అందచందాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలు నాకోసం ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంలేదు..

పై ఫొటోలో ఉన్న హాట్ బ్యూటీ ఎవరో కాదు కామాక్షి భాస్కర్ల . ఈ బ్యూటీ చైనాలో ఎంబీబీఎస్ చదివి, అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా చేసింది ఆమె, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. కామాక్షి తన నటనా జీవితాన్ని 2019లో “ప్రియురాలు” చిత్రంతో ప్రారంభించింది. అయితే, ఆమెకు నిజమైన గుర్తింపు 2021లో విడుదలైన “మా ఊరి పొలిమేర” చిత్రంతో వచ్చింది. ఈ హారర్-థ్రిల్లర్ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత “పొలిమేర 2″లో లక్ష్మీ పాత్రలో నటించి మరింత ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ 2024లో న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

అలాగే “విరూపాక్ష”, “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”, “ఓం భీమ్ బుష్” వంటి సినిమాలతో ఆకట్టుకుంటుంది. వీటితోపాటే, “ఝాన్సీ”, “సైతాన్”, “దూత” వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. కామాక్షి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. హారర్, థ్రిల్లర్, కామెడీ శైలుల్లో తన సత్తా చాటుతోంది. 2018లో ఆమె “మిస్ తెలంగాణ” టైటిల్ గెలుచుకుని, “మిస్ ఇండియా” పోటీల్లో ఫైనల్స్ వరకు చేరుకుంది. ప్రస్తుతం కామాక్షి “పొలిమేర 3″తో సహా మూడు ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఆమె గ్లామరస్ ఫోటోలు తరచూ దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ బ్యూటీని అభిమానులు “క్వీన్ ఆఫ్ హారర్ థ్రిల్లర్స్”గా పిలుస్తుంటారు.

ఇది కూడా చదవండి : చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.