మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్

ప్రస్తుతం తెలుగు సినీరంగంలో సత్తా చాటుతున్న తెలుగమ్మాయిలలో కామాక్షి భాస్కర్ల ఒకరు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తుంది. తెలుగులో ఇప్పుడిప్పుడే చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతుంది ఈ అందాల తార..

మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్
Actress

Updated on: Nov 09, 2025 | 11:42 AM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది కోట్లు కూడబెడుతున్నారు. మరి కొంతమంది మాత్రం కనిపించకుండా పోతున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి సక్సెస్ అవుతున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారింది. అంతే కాదు తన అందచందాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతే కాదు మనశాంతి కోసం స్మశానికి వెళ్తాను అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

బాలయ్యకు లవర్‌గా, తల్లిగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

కామాక్షి భాస్కర్ల.. ఈ బ్యూటీ చైనాలో ఎంబీబీఎస్ చదివి, అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా చేసింది ఆమె, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. కామాక్షి తన నటనా జీవితాన్ని 2019లో “ప్రియురాలు” చిత్రంతో ప్రారంభించింది. అయితే, ఆమెకు నిజమైన గుర్తింపు 2021లో విడుదలైన “మా ఊరి పొలిమేర” చిత్రంతో వచ్చింది. ఈ హారర్-థ్రిల్లర్ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత “పొలిమేర 2″లో లక్ష్మీ పాత్రలో నటించి మరింత ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ 2024లో న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

7/జీ బృందావన్‌ కాలనీ సీక్వెల్‌లో హీరోయిన్ ఈమేనా..! అందం అదిరిపోయిందిగా..

ఇదిలా ఉంటే తాజాగా కామాక్షి భాస్కర్ల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే కామాక్షి “12 ఎ రైల్వే కాలనీ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా కామాక్షి భాస్కర్ల.. తాజాగా ఓ ప్రమోషన్స్ లో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు నిరాశగా అనిపించినప్పుడు లేదా మనసుకు శాంతిని బలాన్ని కావాలని కోరుకున్నప్పుడు కచ్చితంగా తాను స్మశానానికి వెళ్తానని తెలిపింది. స్మశానానికి వెళ్లడం ద్వారా నాలో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కామాక్షి చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్ళికి ముందే తల్లైంది.. కట్ చేస్తే విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నవాడితో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.