15 ఏళ్లకే హీరోయిన్.. 10 ఏళ్లుగా సినిమాలకు దూరంగా.. అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్

చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొంతమంది యాడ్స్ లో నటించి పేరు తెచ్చుకొని ఆ తర్వాత హీరోయిన్స్ గా మారినవారు ఉన్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

15 ఏళ్లకే హీరోయిన్.. 10 ఏళ్లుగా సినిమాలకు దూరంగా.. అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్
Actress

Updated on: Jan 20, 2026 | 9:15 PM

ఒకప్పుడు తన అందంతో అభినయంతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఓ అందాల భామ. చేసింది తక్కువ సినిమాలే కానీ చాలా మంది అభిమాన హీరోయిన్ ఆమె.. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఆ అందాల తార. అయితే కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. దాదాపు 10ఏళ్లు అవుతుంది ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరం అయ్యింది. విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఈ బ్యూటీకోసం కుర్రాళ్ళు గుండెల్లో గుడి కట్టుకున్నారు. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని కుర్రాళ్ళు తెగ ఫీల్ అయిపోయారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? వేల కోట్ల ఆస్తికి మహారాణి ఆమె. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు.. సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆ ముద్దుగుమ్మ, తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోలంతా ఈ అమ్మడిని హీరోయిన్ గా తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇంతకు ఆమె ఎవరంటే.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆసిన్. ఈ అందాల భామ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చింది ఆసిన్. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ. మలయాళ సినిమాతో హీరోయిన్ గా మారిన ఆసిన్, తెలుగులో అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమాతో పరిచయం అయ్యింది.

ఇవి కూడా చదవండి

200లకు పైగా సినిమాలు.. కనీసం చివరి చూపుకు కూడా సినిమావాళ్లు రాలేదు

రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమా తర్వాత ఆసిన్ కు ఆఫర్స్ పెరిగాయి. వరుస హిట్లు సొంతం చేసుకుంది బ్యూటీ.. ముఖ్యంగా తెలుగులో రవితేజ, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల తో హిట్ సినిమాలు చేసింది ఆసిన్. అలాగే తమిళ్ లో అజిత్, సూర్య, విజయ్ లతో నటించింది. గజినీ సినిమా ఈ అమ్మడు కెరీర్ ను మార్చేసింది. బాలీవుడ్ లో కూడా మంచి మంచి సినిమాల్లో మెరిపించింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ లతో నటించింది. మైక్రో మ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఆసిన్. అసిన్ ఆస్తి విలుపు ప్రస్తుతం 1300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.. తాజాగా టెన్ ఇయర్స్ ఛాలెంజ్ పేరుతో ఆసిన్ భర్త కొన్ని ఫోటోలను పంచుకున్నాడు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆ హీరో ఉత్త అమాయకుడు, మంచివాడు.. ఏది చెప్పిన చేసేవాడు.. ఆసక్తికర విషయం చెప్పిన తేజ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..