ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్లు.. ఒకే ఒక్క హిట్ అందుకుంది.. ఆస్తిపాస్తులు మాత్రం వందల కోట్లు..

సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా.. పోటోలు క్లిక్ చేస్తారు. వాటిని సోషల్ మీడియా పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. అందునా హీరోయిన్స్ ఫోటోలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. తమ ఫేవరెట్ స్టార్స్ కోసం కొందరు పేజెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో లేటెస్ట్ ఫోటోలు మాత్రమే కాకుండా.. వారి చైల్డ్‌వుడ్ ఫోటోలు, అరుదైన రేర్‌ ఫోటోలు కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్లు.. ఒకే ఒక్క హిట్ అందుకుంది.. ఆస్తిపాస్తులు మాత్రం వందల కోట్లు..
Actress

Updated on: Feb 11, 2025 | 3:29 PM

ఒక్కసారి హీరోయిన్ అయితే చాలు దశ తిరిగిపోతుంది అని చాలా మంది భవిస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ గా రాణించడానికి ప్రయత్నిస్తుంటారు. హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కకోవడం అంటే అంత సులభం కాదు. ఇప్పుడున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతో హిట్స్ కొట్టేసి భారీగా రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు . క్రేజ్ ను బట్టి ప్రైజ్ డిసైడ్ చేస్తున్నారు చాలా మంది అందాల భామలు. కాగా పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీస్ లో ఆ అమ్మడు ఒకరు. చిన్నవయసులోనే కోట్ల రూపాయిలను సంపాదించింది. ఆ అమ్మడు వయసు 27 కానీ.. కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు కూడబెట్టింది. అలా అని వరుస హిట్స్ అందుకుందా.? అంటే అదీ లేదు.. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన ఆ సినిమాలు ఏవి అంతగా విజయం సాధించలేదు. కానీ ఒకే ఒక్క సినిమాతో భారీ హిట్ అందుకుంది.  ఇంతకుఆ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.?

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు. ఆమె  ఇప్పుడు హాట్ బ్యూటీగా దుమ్మురేపుతోంది. వరుసగా సినిమాలు చేస్తుంది కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది. మొత్తానికి  మొన్నీమధ్య ఓ భారీ హిట్ అందుకుంది. ఇంతకు ఈ బ్యూటీ ఎవరంటే.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది జాన్వీ కపూర్.మొన్నటివరకు హిందీలో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లొనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది ఈ చిన్నది. ఇక గత ఏడాది  ఎన్టీఆర్ కు జోడీగా దేవర సినిమాలో నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది జాన్వీ. త్వరలోనే దేవర 2 రానుంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా నటిస్తుంది జాన్వీ కపూర్. ఇక సోషల్ మీడియాలో జాన్వీ అందాలకు యమా క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది. కాగా జాన్వీ వయసు ఇప్పుడు 27 ఏళ్ళు కానీ కోట్ల ఆస్తిని సంపాదించింది. తల్లి స్టార్ హీరోయిన్, తండ్రి బడా నిర్మాత అయినా కూడా జాన్వీ సొంతంగా సంపాదిస్తూ కోట్లు కూడబెట్టింది.

.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి