
ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి మెప్పించారు నటుడు మురళీమోహన్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు మురళీమోహన్. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మురళి మోహన్ ఆ తర్వాత సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. హీరోలకు అన్నయ్యగా.. ఆ తర్వాత తండ్రి పాత్రల్లో నటించి మెప్పించారు మురళీ మోహన్. ఇటీవలే ఆయన బాలకృష్ణ నటించిన అఖండ 2లో కనిపించి మెప్పించారు. హీరోగానే కాదు నిర్మాతగానూ సినిమాల్లో రాణించారు మురళీ మోహన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ..
దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో ఆయనకు మంచి ఆత్మీయ అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఒక రోజు సరదాగా నాగేశ్వరరావు గారు మురళి, సాయంత్రం నువ్వు ఏం తీసుకుంటావు.? అని అడిగారు. అందుకు మురళీ మోహన్ “ఏమీ తీసుకోను” అని బదులిచ్చారట. నాగేశ్వరరావు “అదేమిటయ్యా, బాగా నిద్ర పడుతుందా?” అని ప్రశ్నించగా, మురళీ మోహన్ తనకు నిద్ర బాగా పడుతుందని చెప్పారు. 60 ఏళ్లు దాటిన తర్వాత, నరాలు బలహీనపడతాయని, వాటిని ఉత్తేజపరచడానికి ఏదైనా మంచి డ్రింక్ తీసుకోవాలని, అయితే అది సరాయిలాగా తాగడం కాదని, ఒక మెడిసిన్‌లాగా వైన్ లేదా మంచి బ్రాందీని, ఒక పెగ్గు లేదా రెండు పెగ్గులు మాత్రమే తీసుకోవాలని ఏఎన్‌ఆర్ సలహా ఇచ్చారని తెలిపారు.
అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందమైన హీరోయిన్స్ ఉన్నారని.. అందరిలో శ్రీదేవి చాలా అందమైన హీరోయిన్ అని అన్నారు. ఆమెలా ఎవరు ఉండేవారు కాదు. చాలా మంచి అమ్మాయి. ఆమె తర్వాత అంత అందంగా ఉండే హీరోయిన్ ఎవరు అంటే దీప అనే చెప్పాలి. ఆమె చాలా అందంగా ఉండేది. దీప చిన్నవయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. కానీ ఎప్పుడు షూటింగ్ కు వచ్చిన పక్కనే వాళ్ల అమ్మ కూడా వచ్చే వారు. ఆమె బ్యాగ్ నిండా బిస్కెట్స్, చిరు తిండ్లు తీసుకువచ్చి ఆమెకు తినిపించేది. అది ఒక కారణం అలాగే ఆమెను ముందుగానే హీరోయిన్ చెయ్యాలని స్టెరాయిడ్స్ కూడా ఇచ్చారని అప్పట్లో అనేవారు. దాంతో ఆమె బరువు పెరిగిపోయింది. లేకపోతే అద్బుతమైన నటి ఆమె అని తెలిపారు మురళీమోహన్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..