
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, ఆయన క్రేజ్ గురించి, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మూవీతో సౌత్ లోనే కాకుండా.. నార్త్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ మూవీస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు డార్లింగ్. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న రాజాసాబ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ తర్వాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బుజ్జిగాడు, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో హిట్స్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ జక్కన్న తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు. అయితే ప్రభాస్ బయట చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. అలాగే తన సినిమాల్లో హీరోయిన్లతో ఎక్కువగా రొమాన్స్, లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడడు.
కానీ ప్రభాస్ సినిమాలో లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రభాస్ లిప్ లాక్ ఇచ్చిన ఆ హీరోయిన్స్ ఎవరో తెలుసా.? ఆ అందాల భామలు ఎవరో కాదు అనుష్క, శ్రద్దా కపూర్, పూజా హెగ్డే. ప్రభాస్, అనుష్క కాంబోలో బిల్లా, మిర్చి, బాహుబలి మూవీస్ వచ్చాయి. బిల్లా సినిమాలో ఓ సీన్ లో లిప్ లాక్ ఉంటుంది. ఆ తర్వాత బాహుబలి 2లో పడవలో ప్రయాణంలో వచ్చే హంసనావా పాటలో లిప్ లాక్ సీన్ ఉంది. ఆతర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమాలో ప్రభాస్ ,శ్రద్దా కపూర్ లిప్ కిస్ సీన్ ఉంటుంది. అలాగే రాధేశ్యామ్ సినిమాలోనూ పూజా హెగ్డేతో లిప్ లాక్ సీన్ ఉంది. ఇలా ముగ్గురు హీరోయిన్స్ తో ;ప్రభాస్ లిప్ లాక్ సీన్స్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమాతోపాటు.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే సలార్ 2, హనురాఘవాపుడి సినిమా, కల్కి 2 లైనప్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .