Oke Okkadu : ఒకేఒక్కడు సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఆయనే..

ఎన్నో అద్భుతమైన సినిమాలను అందుంచారు శంకర్ . ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన వాటిలో ఒకేఒక్కడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కడు 1999 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో అర్జున్ హీరోగా నటించగా మనీష కోయిరాల హీరోయిన్ గా చేసింది.

Oke Okkadu : ఒకేఒక్కడు సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఆయనే..

Updated on: May 21, 2023 | 8:57 AM

సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఈవారంటే చెప్పే పేరులో శంకర్ ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను అందుంచారు శంకర్ . ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన వాటిలో ఒకేఒక్కడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కడు 1999 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో అర్జున్ హీరోగా నటించగా మనీష కోయిరాల హీరోయిన్ గా చేసింది. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం.. ఒక్క రోజు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యి భారీ విజయం అందుకున్న ఈ సినిమా హిందీలోనూ రీమేక్ అయ్యింది. తమిళంలో ముదల్ వన్ అనే పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఈ సినిమాలో రఘువరణ్ అద్భుతంగా నటించి మెప్పించారు.

అప్పట్లోనే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది.  కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమాకి 15 కోట్ల రూపాయిల షేర్ వసూల్ చ్చేసిందంట ఈ సినిమా.. మొత్తంగా ఈ సినిమా అప్పట్లోనే పాన్ ఇండియా మూవీగా హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే ముందుగా ఈ సినిమాలో హీరోగా టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట.

ఒకేఒక్కడు సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయాలనుకున్నారట దర్శకుడు శంకర్. ఈ సినిమా కథకు చిరు అయితే కరెక్ట్ గా సెట్ అవుతారని భావించారట శంకర్. అయితే చిరంజీవి అప్పటికే బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో.. అర్జున్ తో ఈ సినిమా చేశారట శంకర్. అదే సినిమా మెగాస్టార్ చేసుంటే నెక్స్ట్ లెవల్ లో ఉండేదని అంటున్నారు సినీజనాలు.