దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘వారసుడు’. తమిళంలో ‘వరిసు’ పేరిట రిలీజైన ఈ సినిమా రెండు భాషల్లోనూ అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలోని ‘రంజితమే’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాట్‌బస్టర్స్‌లో ఇదే టాప్. అయితే ఈ సాంగ్‌లో కనిపించిన ఓ అమ్మాయి.. అటు ఎక్స్‌ప్రెషన్స్, ఇటు డ్యాన్స్‌లో ఏకంగా హీరోయిన్ రష్మికనే బీట్ చేస్తూ.. అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఎవరన్నది కనుక్కునేందుకు నెటిజన్లు ఏకంగా ఇన్‌స్టాలో ఆ డ్యాన్సర్ ఖాతా డీటెయిల్స్ కోసం ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే..? ఆమె పేరు అంబికా కోహ్లీ. ఇన్‌స్టా ఐడీ ‘పటాకా’ అని పెట్టుకుంది. ముంబైకి చెందిన ఈ డ్యాన్సర్‌కు ఇన్‌స్టాలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అటు ప్రైవేటు సాంగ్స్.. ఇటు సినిమాల్లో డ్యాన్సర్‌గా రాణిస్తూ.. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ..