అప్పట్లో హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు అందాల విలన్.. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్

సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సహాయక పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ అందాల భామ తన నటనతో ఇప్పుడు ఇండస్ట్రీలో దూసుకుపోతుంది .

అప్పట్లో హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు అందాల విలన్.. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్
Sriya Reddy

Updated on: Apr 04, 2026 | 8:19 PM

సినిమాల్లో చాలా మంది.. కేవలం హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, విలన్స్ గా చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. ఆమె అందం, అభినయంతో ప్రస్తుతం దూసుకుపోతున్నారు. మేల్ యాక్టర్స్ మాత్రమే కాదు, ఫీమేల్ ఆర్టిస్ట్ లు కూడా సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీ లేడీ విలన్ గా నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను కవ్వించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? విలన్ గానే కాదు హీరోయిన్ గాను సినిమాలు చేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా అదరగొట్టింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే పాన్ ఇండియా హిట్ సాధించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? హీరోయిన్స్ కు మించిన క్రేజ్ ఉన్న ఆ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో కాదు అందాల భామ శ్రియ రెడ్డి. తెలుగులో అప్పుడప్పుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. శ్రియ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే అందంతోనూ ఆకట్టుకుంది. శ్రియ రెడ్డి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. తెలుగులో అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తుంది.

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో మెప్పించింది శ్రియ రెడ్డి. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. సలార్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న శ్రియ రెడ్డి.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో నటించింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోనూ శ్రియ రెడ్డి కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం సలార్ 2 సినిమాలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన గ్లామర్ ఫొటోలతో కవ్విస్తుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us