
90వ దశకం తర్వాత దక్షిణాది సినిమా ప్రపంచం మరింత అభివృద్ధి చెందింది. అనేక చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి. అలాగే సూపర్ స్టార్ నటీనటులు వెలుగులోకి రావడం ప్రారంభించారు. అప్పట్లో థియేటర్లలోకి జనాలు రావడం పెరిగింది. దీంతో అప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.50 లక్షలు పారితోషికం తీసుకునే నటులు రూ.కోటి పైగా వసూలు చేశారు. అయితే అప్పట్లోనే ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీని ఏలేసింది. స్టార్ హీరోలకు ధీటుగా ఒక్కో చిత్రానికి రూ. 1 కోటికి పైగ రెమ్యునరేషన్ తీసుకుంది. ఆమె మరెవరో కాదు.. దివంగత హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లో ఆమెతో కలిసి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
భారతీయ సినిమా ప్రపంచంలో మొదటి సారి కోటి పారితోషికం తీసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. 1992లో వచ్చిన అపద్బాంధవుడు సినిమాకు చిరు ఏకంగా కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నారు. ఆ తర్వాత అంతే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. 1993లో విడుదలైన ‘రూప్ కి రాణి సోరోం కా రాజా’ అనే హిందీ చిత్రానికి నటి శ్రీదేవికి కోటి రూపాయలు పారితోషికం తీసుకుందట. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. అప్పట్లో అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలకు మాత్రమే కోట్లలో జీతాలు ఉండేవి. 1997లో సినిమా నుంచి రిటైర్ అయ్యేవరకు ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా దూసుకుపోయింది.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
1992 నుంచి 1997 వరకు ఆమె అన్ని భాషలలోని స్టా్ర్ హీరోలతో కలిసి నటించింది. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీదేవి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. అప్పట్లో మొదటిసారి కోటి పారితోషికం తీసుకునే కథానాయికగా చరిత్ర సృష్టించింది శ్రీదేవి. 1997లో సినిమాల నుంచి తప్పుకున్న శ్రీదేవి.. చాలా సంవత్సరాలకు ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
Sridevi Film
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?