
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువైంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాలన్నీ పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు కంటెంట్ ను నమ్ముకొని తెరకెక్కిన చాలా మూవీస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. కొత్త హీరోలు, కొత్త దర్శకులు తెరకెక్కిస్తున్న చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మాతల పాలిట వరంగా మారుతున్నాయి. చిన్న సినిమాలతో బోలెడన్ని లాభాలు అందుకున్న నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఒక భాషలో కాదు ఐదు ఆరు సినిమాల్లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఓ మూవీ రీసెంట్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అంతే కాదు నయా రికార్డ్ ను క్రియేట్ చేసి ఆడియన్స్ చేత శబాష్ అనిపించుకుంటుంది. కేవలం రూ. 10కోట్లతో తెరకెక్కించిన ఆ సినిమా ఇప్పుడు రూ. 250కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరూ నోరెళ్లబెట్టాలా చేసింది ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?
ఆ సినిమా మరేదో కాదు మలయాళ సంచలనం వాలా Ⅱ. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. సాహు గారపాటి తన ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
థియేటర్స్ లోనే కాదు ఓటీటీల్లోనూ ఈ సినిమా దుమ్మురేపింది. ఈ సినిమాలో కంటెంట్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ‘వాలా’ ముగిసిన దగ్గర నుంచి కొనసాగుతూ.. సీక్వెల్ కథ మెయిన్ గ్యాంగ్ జీవితాలను ప్రజెంట్ చేసింది. దాంతో చాలా మంది వాలా Ⅱపై ఆసక్తి పెరిగింది. పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా, భారీ ప్రచారం లేకపోయినా, కేవలం బలమైన కథతో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఏప్రిల్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి