చిన్న సినిమా పెద్ద హిట్..! రూ. 8 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ. 84కోట్లకు పైగా రాబట్టింది

చిన్న సినిమాలు ఇప్పుడు అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీల్లో దుమ్మురేపుతున్నాయి. కంటెంట్ ను నమ్ముకున్న సినిమాలు చాలా పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకుంటున్న సినిమాలు కలెక్షన్స్ పరంగానూ దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే..

చిన్న సినిమా పెద్ద హిట్..! రూ. 8 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ. 84కోట్లకు పైగా రాబట్టింది
Movie

Updated on: Oct 02, 2026 | 8:52 AM

పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు లేదా మిడ్ బడ్జెట్ చిత్రం నిలబడటం అంత సులభం కాదు. కానీ కొన్ని సినిమాలు మాత్రం పెద్ద హీరోల మూవీతో పోటీ పడి హిట్ టాక్ తెచ్చుకుంటూ ఉంటాయి. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో చాలా చిన్న సినిమాలు దైర్యంగా పెద్ద సినిమాల మధ్యలో విడుదలవుతూ ఉంటాయి.  ముఖ్యంగా సంక్రాంతి లాంటి పెద్ద సీజన్‌లో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతుంటే కొత్త సినిమా ప్రేక్షకుల దృష్టి ఆకర్షించడం అనేది మామలు విషయం కాదు. అలా నిలబడ్డ సినిమాలే ఇది. కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ. 84కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా. అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది.

అయితే ఈ ఏడాది సంక్రాంతికి భారీ సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడుమ మురారి.. ఈ సినిమాల మధ్య అనగనగా ఒక రాజు సినిమా కూడా విడుదలైంది.ఈ చిత్రం సుమారు రూ.8 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.84 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అంటే నిర్మాణ ఖర్చుతో పోల్చితే భారీ స్థాయిలో రాబడి సాధించిన సినిమాగా నిలిచింది ఈ మూవీ.

ఈ సినిమా విజయానికి నవీన్ పొలిశెట్టి కామెడీ ఇమేజ్, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, సంక్రాంతి విడుదలలాంటి అంశాలు కలిసి వచ్చాయి. అదే సమయంలో భారీ సినిమాల మధ్య కూడా తనకంటూ ప్రత్యేకమైన స్పేస్ సంపాదించుకోవడం సినిమాకు ప్లస్ అయింది. చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రధాన బలం కంటెంట్. స్టార్ పవర్ తక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడితే అది దూసుకుపోతుంది. సోషల్ మీడియా, మౌత్ టాక్ ద్వారా మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. ‘అనగనగా ఒక రాజు’ విషయంలోనూ ఇదే జరిగింది. అందుకే ఈ సినిమా కేవలం కలెక్షన్ల పరంగా మాత్రమే కాకుండా.. పెద్ద సినిమాల మధ్య ఒక మిడ్ బడ్జెట్ తో వచ్చి హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us