Mahesh Babu:ఇదెక్కడి మాస్ రా మావ..! 1500సార్లు టీవీలో టెలికాస్ట్ అయ్యి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ సినిమా..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

Mahesh Babu:ఇదెక్కడి మాస్ రా మావ..! 1500సార్లు టీవీలో టెలికాస్ట్ అయ్యి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ సినిమా..
Mahesh Babu

Updated on: Mar 17, 2025 | 7:56 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనున్నారని, మహేష్ సినిమా పాన్ గ్లోబల్ మూవీ అని అభిమానులు అంటున్నారు. రాజమౌళి కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ ఆయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక మహేష్ సినిమాలు థియేటర్స్ లోనే కాదు టీవీల్లోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా టీవీల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాయి.

అయితే మహేష్ బాబు సినిమా టెలివిజన్ లో 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ చేసింది. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు 1000సార్లు టెలీకాస్ట్ అవ్వడమే చాలా కష్టం అలాంటిది మహేష్ సినిమా ఏకంగా 1500సార్లు టెలికాస్ట్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు కెరీర్ లో థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి, టీవీల్లో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాల్లో థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయాయి. అయితే అతడు సినిమా టీవీలో టెలికాస్ట్ అయ్యి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పట్లో ప్రతి సండే వచ్చిందంటే చాలు అతడు సినిమా టీవీలో రావాల్సిందే. స్టార్ మా ఛానెల్ లో ఏకంగా 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..