మొదటి షో చూసి ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే క్లాసిక్ హిట్.. థియేటర్‌లో బోరు బోరున ఏడ్చిన జనం..

వారాంతం వచ్చిందంటే చాలు థియేటర్స్ కొత్త సినిమాలతో కళకళలాడుతున్నాయి. వారం వారం కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాను ఎవ్వరూ ఆపలేరు. కథలో బలం ఉంటే చిన్న సినిమా అయినా సరే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది.

మొదటి షో చూసి ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే క్లాసిక్ హిట్.. థియేటర్‌లో బోరు బోరున ఏడ్చిన జనం..
Movie News

Updated on: Jul 04, 2026 | 8:17 PM

తెలుగు సినిమా చరిత్రలో మాతృదేవోభవ ఒక అద్భుతం అనే చెప్పాలి. 1993లో కేవలం 30 లక్షల రూపాయల బడ్జెట్‌తో కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా రూ . 7 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం కేవలం ఆర్థిక రికార్డులను మాత్రమే తిరగరాయలేదు, సమాజంపై కూడా బలమైన ప్రభావాన్ని చూపింది, అనేక మంది జీవితాలను ప్రభావితం చేసింది. సినిమా నిర్మాణం అనంతర పరిణామాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ముందుగా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన బయ్యర్లకు సారథి స్టూడియోలో ప్రీమియర్ షో వేశారు. మొదట సినిమాపై వారికి పెద్దగా ఆసక్తి లేక, సినిమా నచ్చలేదన్నట్లుగా ప్రవర్తించారు. కానీ, మరుసటి రోజు వచ్చి, అంతకుముందు ఎప్పుడూ ఏడవని తమలాంటి కఠిన స్వభావం కలవారు సైతం ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇది అద్భుతమైన చిత్రమని కొనియాడారు.

ఇది కూడా చదవండి : Hema : అమ్మబాబోయ్.. హేమ కూతుర్ని చూశారా..!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

మాతృదేవోభవ చూసిన తర్వాత చాలా మంది మద్యపానం మానేసినట్లు, తమ కుటుంబం గురించి, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించినట్లు లేఖలు రాశారు. ఈ సినిమా చూడకుండా ఎవరైనా కన్నీళ్లు రాకుండా ఉండగలరా అని పందెం కాసిన సంఘటనలు కూడా అప్పట్లో పత్రికల్లో వచ్చాయి. వెయ్యి రూపాయల బెట్టింగ్‌లు చర్చనీయాంశంగా మారాయి. ఈ చిత్రం సాధారణ ప్రజలకు ఎంతగా చేరువయ్యిందో చెప్పడానికి ఒక సంఘటనను గుర్తు చేసుకోవచ్చు. కావలిలో శ్రీరామనవమి సందర్భంగా వీధుల్లో వీసీడీలు వేసి సినిమాలు ప్రదర్శించేవారు. ఒకే వీధిలో చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి సినిమాను ఒక చోట, మాతృదేవోభవ సినిమాను మరో చోట ప్రదర్శించారు. ముఠా మేస్త్రి వద్ద జనం కాస్త తక్కువగా ఉండగా, మాతృదేవోభవ చూస్తున్న ప్రజలు రోడ్ల మీదనే బోరున ఏడ్వడం, భావోద్వేగంతో దొర్లుకోవడం జరిగిందట. థియేటర్లలో మాత్రమే కాకుండా, బహిరంగ ప్రదేశాలలో కూడా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా లీనం చేయగలిగింది.

ఇది కూడా చదవండి : Pawan Kalyan: డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్

సినిమాకు మంచి టాక్ వచ్చినా, ప్రారంభంలో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, నిర్మాత రాంబాబు అలాగే చిత్ర బృందం ప్రమోషన్ వ్యూహాలపై దృష్టి సారించారు. మూడో రోజు నాటికి థియేటర్ల నుంచి సినిమాను తొలగించే పరిస్థితి రావడంతో, వేగంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. రాంబాబు గారు జిల్లాల డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి, ఒక రూపాయి లోపు లేడీస్ కర్చీఫ్‌లు కొని టిక్కెట్టుతో పాటు ఉచితంగా ఇవ్వమని ఆదేశించారు. ఈ అనూహ్య వ్యూహం అద్భుతంగా పనిచేసింది. కర్చీఫ్‌ల పంపిణీ మొదలు కాగా, గురువారం నాటి రెండో షోకు థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. వైజాగ్, రాజమండ్రి వంటి ప్రాంతాల నుండి థియేటర్లు నిండిపోయిన వార్తలు రావడంతో చిత్ర బృందం మొదట షాక్ అయ్యింది. శుక్రవారం వేరే సినిమాను ప్రదర్శించడానికి ప్రణాళికలు వేసుకున్న థియేటర్ల యజమానులు, ప్రజల డిమాండ్ మేరకు మాతృదేవోభవనే కొనసాగించారు. ఒక రోజు ఆలస్యమై ఉంటే సినిమా ఫ్లాప్ అయ్యేదని నిర్మాత రాంబాబు అన్నారు. మాతృదేవోభవ కేవలం ఒక సినిమాగా మిగిలిపోకుండా, తెలుగు ప్రజల జ్ఞాపకాల్లో ఒక భావోద్వేగ స్మృతిగా నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 9 సినిమాలు.. 5 హిట్లు..! టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ.. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us