ఇటీవల అలరించిన సినిమాల్లో తమిళ్ మూవీ లవ్ టుడే ఒకటి. ఈ సినిమా యువతను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లవర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వం వహించి హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇవానా.. అలాగే సత్య రాజ్, రాధికా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ ఆకట్టుకుంటోంది ఈ సినిమా. అయితే ఈ సినిమా తర్వాత హీరోయిన్ ఇవానా అందానికి, నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. చూడముచ్చటైన ఈ అమ్మడి రూపం కుర్రాళ్లను కట్టిపడేసింది.
దాంతో ఈ అమ్మడు ఎవరు అంటూ గూగుల్ ను గాలించేస్తున్నారు కుర్రకారు. ఇవానా అసలు పేరు అలీనా షాజీ. అయితే ఈ పేరు పలకడానికి కష్టంగా ఉండటంతో ఇవానా గా మార్చుకుంది . ఇవానా కేరళా కుట్టి. ఈ అమ్మడు వయసు 22. 2018లోనే తమిళ డబ్బింగ్ చిత్రం ఝాన్సీతో తెలుగులో పరిచయం అయింది. ఈ సినిమా జోతిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో కనిపించింది ఇవానా.
అలాగే మాస్టర్స్ (2012) అనే మలయాళ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది ఇవానా. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది . ఇక ఇప్పుడు ఈ భామకు తెలుగులో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఓ యంగ్ హీరోకు జోడీగా సినిమా అనౌన్స్ చేయనున్నారని టాక్.