AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ సినిమా కోసం గురూజీ ఆ సీనియర్ హీరోయిన్‌ను రంగంలోకి దింపనున్నారా..?

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఎంత క్రేజ్ సొంతం చేసుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mahesh Babu: మహేష్ సినిమా కోసం గురూజీ ఆ సీనియర్ హీరోయిన్‌ను రంగంలోకి దింపనున్నారా..?
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Jan 17, 2023 | 5:12 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఈ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఎంత క్రేజ్ సొంతం చేసుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు మహేష్ కెరీర్ లో 28వ సినిమా గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాల్సింది. కానీ మహేష్ అన్న, అమ్మ, నాన్న ఇలా వరుసగా స్వర్గస్థులు కావడంతో మహేష్ ఇంట విషాదం నిండింది. దాంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మహేష్ ఆ బాధనుంచి కోలుకొని షూటింగ్ కు హాజరు కానున్నారు. ఈ సినిమాను మహేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అలాగే ఈ సినిమాను ఆగస్టు లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ సీనియర్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది. తన ప్రతి సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ ఉండేలా చూస్తుంటారు త్రివిక్రమ్.

ఇవి కూడా చదవండి

అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అలాగే అజ్ఞాతవాసి సినిమా ఖుష్బూ, ఆలా వైకుంఠపురంలో సినిమాలో టబు లను ఎంపిక చేశారు త్రివిక్రమ్. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా ఓ సీనియర్ హీరోయిన్ ను రంగంలోకి దింపనున్నారట. ఆమె ఎవరో కాదు హీరోయిన్ శోభన, అలనాటి తారల్లో శోభన ఒకరు. హీరోయిన్ గానే కాకుండా శోభన క్లాసికల్ డాన్సర్ గాను ప్రసిద్ధురాలు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మహేష్ సినిమా కోసం గురూజీ శోభనను తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలిసియాల్సి ఉంది. ShobanaShobana

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..