
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఇటీవలే బైకర్ సినిమాలో నటించారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ కథానాయకుడికి తండ్రిగా, కోచ్ గా బుల్లెట్ సునీల్ నారాయణ్ పాత్రలో అదరగొట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాజశేఖర్ నటన కన్నీళ్లు తెప్పించిందని చెప్పవచ్చు. అంతకు ముందు నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ సినిమాలోనూ ఓ కీ రోల్ పోషించారీ యాంగ్రీమ్యాన్. ఇక ప్రస్తుతం సహాయక నటుడిగా మెప్పిస్తోన్న రాజశేఖర్ ఒకప్పుడు హీరోగా టాలీవుడ్ లో చక్రం తిప్పారు. యాంగ్రీమ్యాన్ పేరుకు తగ్గట్టుగానే పవర్ ఫుల్ పాత్రలతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ హీరోలకు గట్టి పోటీనిచ్చారు. ఇప్పటివరకు సుమారు 80కు పైగా సినిమాల్లో నటించారు రాజశేఖర్. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేశారాయన. అయితే ఒక హీరోయిన్ మాత్రం రాజశేఖర్ కు కూతురుగా, ప్రియురాలిగా రెండు వేరు వేరు సందర్భాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు అందాల రాశి.
ఛైల్డ్ ఆర్టిస్టుగా చేసి హీరోయిన్ గా మారిన వారిలో రాశి ఒకరు. కెరీర్ ప్రారంభంలోనే ఆమె చాలా మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా 1989లో వచ్చిన మమతల కోవెల సినిమాలో రాశి ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. అందులో రాజశేఖర్ కూతురిగా ఆమె యాక్ట్ చేసింది. అప్పుడు రాశి వయసు కేవలం పదేళ్లు మాత్రమే. ఈ సినిమా వచ్చిన సరిగ్గా పదేళ్ల తర్వాత అంటే.. 1999లో రిలీజైన నేటి గాంధీ సినిమాలో అదే రాజ శేఖర్‌తో హీరోయిన్‌గా రొమాన్స్ చేసింది. అప్పుడు రాశికి 20 ఏళ్లు. అలా రాజశేఖర్‌కు కూతురి, అదే విధంగా హీరోయిన్‌గా నటించిన ఏకైక హీరోయిన్‌గా రాశి నిలిచింది.
కాగా రాజశేఖర్ లాగే రాశి కూడా ఇప్పుడు సహాయక నటిగా రాణిస్తోంది. ఇటీవల రిలీజైన పాపం ప్రతాప్ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంది రాశి . ప్రస్తుతం ఈ నటి చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.