గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.. ‘అనగనగా ఒక రాజు’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సంక్రాంతి కానుకగా బుధవారం (జనవరి 14)న విడుదలైన అనగనగా ఒక రాజు సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మారి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.. అనగనగా ఒక రాజు సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Anaganaga Oka Raju Movie

Updated on: Jan 14, 2026 | 2:52 PM

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలతో టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు నవీన్ పోలిశెట్టి. ముఖ్యంగా ఈ హీరో కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఓ యాక్సిడెంట్ కారణంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడీ యంగ్ హీరో. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. బుధవారం (జనవరి 14)న విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. సినిమాలో నవీన మార్క్ ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోయిందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ప్రశంసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మారి తెరకెక్కించిన అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది.

అయితే అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ మీనాక్షి చౌదరి కాదట. ఇందులో మొదట హీరోయిన్ గా శ్రీలీల ను తీసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఈ మధ్యన శ్రీలల చేసిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజైన తమిళ సినిమా పరాశక్తి కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అనగనగా ఒక రాజు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటించి ఉండినట్లయితే శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగి ఉండేది. పైగా హీరో నవీన్ పొలిశెట్టికి కూడా ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఏదేమైనా శ్రీలీల సూపర్ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిందన్న అభిప్రాయం సినిమా సర్కిళ్లలో వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్లలో మీనాక్షి చౌదరి..

‘అనగనగా ఒకరాజు’ సినిమా విషయానికి వస్తే హీరో, హీరోయిన్లతో పాటు రావు రమేశ్‌, చమ్మక్‌ చంద్ర, మహేశ్‌ తదితరులు వివిధ పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.