
సినిమా ఇండస్ట్రీలో ఏజ్ గ్యాప్ అనేది అనవసరమైన టాపిక్. హీరో, హీరోయిన్స్ మధ్య ఏజ్ గ్యాప్ అనేది చాలా కామన్. చాలా మంది హీరోలు తమకన్నా వయసులో చాలా చిన్న వయసున్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేశారు. అంతే కాదు కూతురు వయసున్న హీరోయిన్స్ సరసన కూడా సినిమాలు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే.. 56ఏళ్ల హీరోతో 20ఏళ్ల హీరోయిన్ నటించి అందరికి షాక్ ఇచ్చింది. అంతే కాదు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇంతకూ ఆ హీరో, హీరోయిన్ ఎవరో.? ఆ సినిమా ఎదో తెలుసా.? నందమూరి తారక రామారావు నటించిన డ్రైవర్ రాముడు చిత్రం 1979 ఫిబ్రవరి 2న విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమా, ఎన్టీఆర్ కెరీర్‌లోని 265వ చిత్రంగా గుర్తింపు పొందింది.
56 ఏళ్ల వయసులో ఎన్టీఆర్, అప్పటి 20 ఏళ్ల జయసుధతో కలిసి రొమాంటిక్ పాత్రలో నటించడం అప్పట్లో విశేష చర్చకు దారి తీసింది. దాదాపు 35 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ, వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై అద్భుతంగా పండింది. ఈ సినిమా నిర్మాణ వేగం ఆశ్చర్యకరం. దర్శకుడు కె. రాఘవేంద్రరావు కేవలం 28 రోజుల్లో, మూడు షెడ్యూల్లలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారట. రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాలకు ఎన్టీఆర్ స్వయంగా రోడ్లు వేయించి, సినిమా చిత్రీకరణకు సహకరించారట. 1978 అక్టోబర్ నుంచి 1979 ఏప్రిల్ మధ్య మూడు చిత్రాలు విడుదల చేయాలనే ఎన్టీఆర్ సంకల్పంలో భాగంగా డ్రైవర్ రాముడు ఒక కమర్షియల్ చిత్రంగా రూపొందించారట.
ఎన్టీఆర్ సొంత బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రానికి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. కె. రాఘవేంద్రరావుకు నందమూరి వారి బ్యానర్‌లో ఇది తొలి చిత్రం. లారీ డ్రైవర్ పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. రోజారమణి, శ్రీధర్, కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు, రావు గోపాలరావు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. డ్రైవర్ రాముడు విజయానికి ప్రధాన కారణాలలో ఒకటి దాని కథనం, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డైలాగులు, జంధ్యాల రాసిన కామెడీ పంచ్‌లు. చక్రవర్తి అందించిన సంగీతం, ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం, బాలు గానం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌ను బలంగా చూపించి ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. బాక్సాఫీస్ వద్ద డ్రైవర్ రాముడు సంచలనం సృష్టించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నెల్లూరుతో సహా పలు కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తిరుపతిలో 25 వారాలు, విజయవాడలో షిఫ్టింగ్‌లతో 25 వారాలు ఆడింది. సెకండ్ రిలీజ్‌లో కూడా సినిమా విజయవంతమైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి