
సాధారణంగా సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా మంది తారలు ఎంతో కష్టపడుతుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు వ్యాపార రంగంలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆమె మరెవరో కాదు.. కృతి సనన్. ఇటీవలే ఆమె 35వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఓవైపు కథానాయికగా రాణిస్తూనే మరోవైపు కాస్మెటిక్ వ్యాపారరంగంలో రాణిస్తుంది.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
కృతి సనన్ తన బ్యూటీ బ్రాండ్ హైఫెన్ రెండవ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. రెండు సంవత్సరాలలో హైఫెన్ రూ.400 కోట్లకు పైగా సంపాదించింది. హైఫెన్ ప్రారంభించిన రెండు సంవత్సరాల్లోనే 400 కోట్లు సంపాదించిందని.. ఒక సంవత్సరంలో 1 మిలియన్ నుండి 4 మిలియన్ల మంది వినియోగదారులను చేరుకోవడం ఒక కల కంటే తక్కువ కాదని అన్నారు సీఈఓ తరుణ్ శర్మ.
Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..
కృతి సనన్ హైఫెన్ బ్రాండ్ ను 2023లో ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. ఆమె ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. ఆమె చివరి చిత్రం ‘దో పట్టి’ (కాజోల్ తో) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..