
సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు వరుసగా హిట్స్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సరైన విజయం కోసం వెయిట్ చేస్తుంది. కొన్నాళ్లుగా ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవుతున్నాయి. అయినప్పటికీ ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వరుసగా ప్లాపులు అవుతున్నప్పటికీ ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తుంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.50 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? 2010లో మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఇటీవలే స్పెషల్ పాటతో అదరగొట్టింది. తనే హీరోయిన్ పూజా హెగ్డే. దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
పూజా హెగ్డే 2012లో మిస్కిన్ దర్శకత్వంలో జీవా నటించిన ‘ముఖమూడి’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ‘ముకుంద’ చిత్రంలో నటించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. 2016లో హృతిక్ రోషన్ నటించిన ‘మొహెంజో దారో’తో హిందీలోకి అడుగుపెట్టింది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో నటించిన ఈ అమ్మడు.. కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించింది. 2021 లో ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమా తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఇప్పటికీ ఆమె సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లపాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న పూజా హెగ్డే.. ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలు అందుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
ఇదిలా ఉంటే.. ఇటీవలే రజినీకాంత్, నాగార్జున నటించిన కూలీ చిత్రంలో మోనికా స్పెషల్ పాటతో అదరగొట్టేసింది. ఈ పాటకు ఆమె దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుందని సమాచారం. పూజా హెగ్డే ముంబైలో రూ. 45 కోట్ల విలువైన 4,000 చదరపు అడుగుల భారీ బంగ్లాను కలిగి ఉంది. అలాగే ముంబై, హైదరాబాద్ లోనూ ఇళ్లు ఉన్నట్లు టాక్. ఆమె ఆస్తులు రూ.50 కోట్లకు పైగా ఉండగా.. ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు వసూలు చేస్తుంది. ఆమె వద్ద రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్, ఆడి కారు, రూ.2 కోట్ల విలువైన పోర్స్చే కయెన్, రూ.60 లక్షల విలువైన జాగ్వార్ కార్లు ఉన్నాయి. ఒక్కో యాడ్ చేయడానికి రూ.40 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం తమిళంలో విజయ్ దళపతి సరసన జననాయగన్ చిత్రంలో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..