
భారతీయ సినీప్రియుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్న హీరోలలో ఆయన ఒకరు. కెరీర్ ప్రారంభంలో విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్స్ అందుకున్నారు. వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగానూ సక్సెస్ అయ్యారు. అంతేకాదు.. ఇటు స్క్రీన్ పై హీరో అయినప్పటికీ.. అటు నిజ జీవితంలో మాత్రం కార్గిల్ యుద్ధంలో చేరి దేశానికి సేవ చేశాడు. ఆర్మీలో కొన్నాళ్లపాటు పనిచేసిన అతడు..తిరిగి సినీరంగంలోకి అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ సినిమా ప్రపంచంలో చురుగ్గా ఉన్నారు. అయితే కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పటికీ.. లగ్జరీ లైఫ్ వదిలేసి ఒక పల్లెటూరిలో సింపుల్ లైఫ్ గడిపేస్తున్నారు. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో నానా పటేకర్.
నానా పటేకర్.. ఒకప్పుడు బీటౌన్ తోపు హీరో. ఇప్పుడు అదే పరిశ్రమలో సహయ నటుడిగా బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. అయితే ముంబై హడావిడీ లైఫ్ కు దూరంగా తన సొంత గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం మధ్య జీవిస్తున్నారు. గతంలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పాల్గొన్న నానా పటేకర్ తను పల్లెటూరిలో ఉండడానికి గల రీజన్ వెల్లడించారు. లగ్జరీ లైఫ్ వదిలి గ్రామంలో ఎందుకు ఉంటున్నావ్ ? అని అమితాబ్ అడగ్గా.. పరిశ్రమకు తానేప్పుడు దూరంగా వెళ్లలేదని.. కేవలం హడావిడి జీవితానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు.
సినిమా చిత్రీకరణ కోసం ముంబై వచ్చి.. తిరిగి తన ఊరు వెళ్లిపోతానని.. గ్రామంలో ఉండడమే తనకు చాలా ఇష్టమని అన్నారు. జీవితంలో కోరుకున్నవాటి కంటే ఎక్కువగా పొందానని.. నగరంలో గోడలు ఉన్నట్లే.. తన ఇంట్లో పర్వతాలు ఉన్నాయని.. పర్వతాలు ఈ వైపు నుంచి వస్తాయని.. తాను పర్వతాల మధ్య జీవించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నానా పటేకర్.. సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే తిరిగి తన గ్రామం వెళ్లిపోతారట.
Nana Patekar
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..