
సినీరంగంలో చాలా మంది నటీనటులు తమ సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమ ప్రతిభతో విజయ శిఖరాలను చేరుకున్న యాక్టర్స్ చాలా తక్కువ మంది. కానీ కొందరు సినీరంగంలో తమ ప్రతిభతో ఫేమస్ అయిన స్టార్స్.. మద్యానికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. అలాంటి నటులలో కళాభవన్ ఒకరు. ఒకప్పుడు ఆయన యాక్టింగ్, సాంగ్స్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. అతడే రామన్ మణి.. అలియాస్ కళాభవన్ మణి. కేరళలోని త్రిసూర్ సమీపంలోని చాలకుడిలో జన్మించారు. అతడి అసలు పేరు రామన్ మణి. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, యాక్టింగ్, మిమిక్రీ అంటే చాలా ఇష్టం. చిన్న వయసులోనే కళాభవన్ అనే రంగస్థల టీంలో జాయిన్ అయ్యాడు. ఈ టీంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అతడి పేరు కళాభవన్ మణిగా మారిపోయింది.
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన కళాభవన్ మలయాళంలో తొలి చిత్రం. ఇందులో ఆటో డ్రైవర్ పాత్రను పోషించారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో 30కి పైగా తమిళ సినిమాలు ఉన్నాయి. తెలుగులో వెంకటేశ్ నటించిన జెమిని సినిమాలో విలన్ గా కనిపించాడు. కళాభవన్ నటుడు మాత్రమే కాదు.. ఆయన సామాజిక కార్యకర్త కూడా. ప్రతిరోజు దాదాపు 20 మందికి సాయం చేసేవారు. తన సహాయకుడి కాలేయ చికిత్స కోసం ఏకంగా రూ.10 లక్షలు ఖర్చు చేశారు.
నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న కళాభవన్ మణి.. 2016 మార్చి 3న తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కళాభవన్ మణి.. ప్రతిరోజూ 12 నుంచి 13 సీసాల బీర్లు తాగేవారని.. కాలేయం పూర్తిగా పాడైనప్పటికీ అతడు ఈ వ్యసనాన్ని ఆపలేదని సన్నిహితులు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్.. అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..