
ఒకప్పుడు జోవనోపాధి కోసం తన పూర్వీకుల వ్యాపారంలో కష్టపడి పనిచేసేవాడు. వ్యాపార రంగంలో సక్సెస్ అయ్యాడు. విదేశాలకు అతడు మామిడి కాయలు ఎగుమతి చేసేవాడు. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అతడు అగ్ర కథానాయికుడు. నటుడిగా ప్రశంసలు అందుకుంటూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. అతడు మరెవరో కాదు కునాల్ కపూర్. 1975 అక్టోబర్ 18న ముంబైలోని ఒక పంజాబీ కుటుంబంలో జన్మించారు. అతడి కుటుంబం మామిడి కాయల వ్యాపారం చేసేవారు. కునాల్ సినిమాల్లోకి రాకముందు హాంకాంగ్ లో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..
అక్కడే అతడు తన కుటుంబంతో కలిసి మామిడి కాయల వ్యాపారం చేసేవాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి.. సినిమాల పట్ల మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అమితాబ్ బచ్చన్, మనోజ్ బాజ్‌పేయి నటించిన యాక్స్ (2001) చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు.ఆ తర్వాత మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ (2004) చిత్రంతో ఆయన హీరోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. కానీ తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. 2006లో విడుదలైన కునాల్ కపూర్ చిత్రం ‘రంగ్ దే బసంతి’ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..
కునాల్ కపూర్ అజిత్ బచ్చన్ కుమార్తె నైనా బచ్చన్‌ను వివాహం చేసుకున్నాడు. కునాల్ , నైనా 2015 లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు కునాల్. అతేకాదు.. ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట.
ఇవి కూడా చదవండి : Actress : ఇండస్ట్రీలో సంచలనం.. 20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు.. 3 విడాకులు.. నెట్టింట హాట్ టాపిక్ ఈ హీరోయిన్..