
రాజ్ అర్జున్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ కొన్ని నెలల క్రితం తెలుగులో రిలీజైన రజాకార్ సినిమా గుర్తుందా? భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా బాగానే ఆడింది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఎంతో మంది నటించినా బాగా హైలెట్ అయ్యింది మాత్రం ఖాసీం రజ్వీ పాత్ర. కరుడు గట్టిన నిజాం ప్రభువుగా, నిరంకుశవాదిగా ఈ రోల్ లో ఒదిగిపోయాడు నటుడు అర్జున్ రాజ్. రజాకార్ సినిమాలో అతనిని చూసి చాలా మంది అసహ్యించుకున్నారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఎంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడో. ఈ సినిమాతో పాటు తెలుగులో గం గం గణేశా, డియర్ కామ్రేడ్ తదితర సినిమాల్లోనూ విలన్ గా నటించి మెప్పించాడు అర్జున్ రాజ్. అలాగే తమిళ్, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. అయితే అర్జున్ రాజ్ కూతురు కూడా ఫేమస్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. తండ్రి అడుగా జాడల్లోనే నడుస్తోన్న ఆమె ఇప్పటికే తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తోంది.
ఇంతకీ అర్జున్ రాజ్ కూతురు ఎవరనుకుంటున్నా. ఆమె పేరు సారా అర్జున్. ఇలా పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టక పోవచ్చు కానీ.. నాన్న సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన పాప అంటే మన కళ్ల ముందు ఓ అందమైన రూపం మెదులుతుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన సారా పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
కాగా నటిగా ఇప్పటికే తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుంది సారా. ఇప్పుడు హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటిస్తోన్న ధురంధర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సారా అర్జున్. కొన్ని రోజుల క్రితమే ఈ టీజర్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అలాగే సారా లుక్స్ కు కూడ అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న దురందర్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.