
దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు గురించి ప్రేత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి మెప్పించారు కోటా శ్రీనివాసరావు. గత ఏడాది జులైలో అనారోగ్య సమస్యలతో కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన సోదరుడు కూడా టాలీవుడ్ నటుడే.. పలు సినిమాల్లో విలన్ గానూ మెప్పించారు ఆయన. ఆయన పేరు కోట శంకర్ రావు. ఆయన చాలా మందికి సుపరిచితులే.. విలన్ గా మెప్పించిన ఆయన సీరియల్స్ లోనూ కనిపించి ఆకట్టుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టీవీ రంగం నుంచి సినిమాలకు వెళ్లే నటుల గురించి, వారికి ఎదురయ్యే సవాళ్ల గురించి కోట శంకర్ రావు తన అభిప్రాయాలను పంచుకున్నారు.
గతంలో టీవీ నటులు సినిమాలకు సెట్ కారనే ఊహ ఉండేదని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని ఆయన అన్నారు. అయితే, టీవీ నుంచి వచ్చి సినిమా స్టార్స్ అయినవారు ఏ భాషలోనైనా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని ఆయన పేర్కొన్నారు, హిందీలో కొంతమంది ఉన్నప్పటికీ, ఇది చాలా పరిమితంగానే ఉందని తెలిపారు. దీనికి ప్రధాన కారణం ఓవర్ ఎక్స్పోజర్ అని కోట శంకర్ రావు అన్నారు. టీవీలో రోజు కనపడటం, సీరియల్స్, ప్రమోల ద్వారా ప్రేక్షకులు నిరంతరం చూస్తుండటం వల్ల ఓవర్ ఎక్స్పోజర్ అవుతుందని, ఇది నటులకు కొంత ప్రమాదకరమని ఆయన అన్నారు.
టీవీలో ఎంత కష్టపడి నటించినా, అనేక పాత్రలు చేసినా, టీవీ రంగం తన మనసుకు నచ్చిన విధంగా నటనను ప్రదర్శించడానికి, ఆర్థికంగా, కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి చాలా సహాయపడిందని అన్నారు. అలాగే తన అన్న కోట శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ.. మా అన్నయ్య ఇంట్లో కుటుంబ సభ్యులను కలిసే సమయం లేకుండా గడిపారు. నాకు సినిమా అవకాశాలు కావాలని ఆయనను అడిగాను ఆయన కూడా సహాయం చేశారని కోట శంకర్ రావు అన్నారు. బిజీ షెడ్యూలు వల్ల అన్నయ్య ఫ్యామిలీకి దూరంగా ఉండేవారు. 120 రోజుల వరకు ఫ్యామిలీకి దూరంగా ఉండేవారు అని అన్నారు కోట శంకర్ రావు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.