
ప్రస్తుతం సినిమా ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్- రాజమౌళి మూవీ ఒకటి. Globetrotter (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ నుంచి రిలీజైన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్, సంచారీ సాంగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను బుధవారం (నవంబర్ 12) రాత్రి రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో ప్రియాంక చోప్రా.. చీరకట్టులో.. హీల్స్ ధరించి.. చేతిలో పిస్టల్ తో ఎంతో డైనమిక్ గా.. పవర్ ఫుల్ గా కనిపించింది. ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లో నే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మందాకినిగా ప్రియాంక లుక్ అద్దిరిపోయిందని కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయంటున్నారు.
కాగా ఈ సినిమాలో మందాకిని పాత్ర కోసం ప్రియాంక చోప్రా కంటే ముందుగా ఇద్దరు హీరోయిన్స్ ని సంప్రదించారట రాజమౌళి. అందులో ఒకరు ఐశ్వర్యరాయ్. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రాజమౌళి ముంబై వెళ్లి మరీ ఈ పాత్ర కోసం ఐశ్వర్య ని సంప్రదించాడట. అయితే కారణాలు తెలియరాలేదు కానీ ఐశ్వర్య ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ తర్వాత పలువురు బాలీవుడ్ హీరోయిన్లను కలిశాడట జక్కన్న. కానీ వారు అప్పటికే ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో నో చెప్పారట. ఇక టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ ను కూడా ఈ పాత్ర కోసం అడిగారని తెలుస్తోంది. ఆమె ఒప్పుకోవడంతో లుక్ టెస్ట్ కూడా చేశారట. అయితే ఎందుకో గానీ ఆ తర్వాత కాజల్ ను పక్కన పెట్టేశారట. దీంతో చివరకు ప్రియాంక చోప్రా ని సంప్రదించారట జక్కన్న. ఆమె వెంటనే అంగీకరించడం, హైదరాబాద్ కి వచ్చి లుక్ టెస్ట్ లో పాల్గొనడం జరిగిందట. దీంతో ప్రియాంకనే ఫైనల్ చేసేశారట. ప్రస్తుతం మందాకినీ పాత్రకు సూపర్బ్ రెస్పాన్స్ నేపథ్యంలో ఈ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.
And now she arrives…
Meet MANDAKINI 💥💥💥@priyankachopra#GlobeTrotter @ssrajamouli @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts @SBbySSK @thetrilight @tseries pic.twitter.com/8XhqsdFL1R— Mahesh Babu (@urstrulyMahesh) November 12, 2025
కాగా Globetrotter చిత్రాన్ని దాదాపు 120 దేశాల్లో రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 15నఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఉండనుంది. ఈ సందర్భంగానే సినిమా టైటిల్ ను కూడా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.