Tollywood: థియేటర్లలో సూపర్ హిట్స్.. సంవత్సరం అయినా ఓటీటీలోకి రానీ సినిమాలు ఇవే..

థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు దాదాపు నెలరోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్నాయి. కానీ మీకు తెలుసా.. ? బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన చిత్రాలు సంవత్సరం అయినప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఇంతకీ ఆ సినిమాలు ఇవే.

Tollywood: థియేటర్లలో సూపర్ హిట్స్.. సంవత్సరం అయినా ఓటీటీలోకి రానీ సినిమాలు ఇవే..
Pooja Meri Jaan

Updated on: May 14, 2025 | 4:49 PM

ఓటీటీలో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు నెలరోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల థియేటర్లలో సూపర్ హిట్ అయిన చిత్రాలు ప్రస్తుతం ఓటీటీలో అత్యధిక వ్యూస్‏తో దూసుకుపోతున్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని.. అత్యధిక వసూళ్లు రాబట్టిన కొన్ని సినిమాలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో ఒప్పందాలు కుదరకపోవడంతో స్ట్రీమింగ్ కానీ సినిమాల గురించి తెలుసుకోండి. అవెంటంటే.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన సినిమా స్త్రీ, ఛావా వంటి సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ దినేష్ విజన్ రూపొందించిన మూడు సినిమాలు ఉన్నాయి. అవే పూజా మేరీ జాన్, రూమీ కి షరాఫత్, సర్వగుణ సంపన్న.

నివేదికల ప్రకారం.. ఈ మూడు సినిమాలు ఓటీటీలతో ఒప్పందంలో విభేధాల కారణంగా ఈ సినిమాలు స్ట్రీమింగ్ కాలేదు. నిర్మాత దినేష్ విజన్ తన సినిమాలకు నిర్ధిష్ట మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. విభిన్న కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాలు ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. మేకర్స్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నిర్వాహకులతో జరిగిన ఒప్పందాలు సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాలు ఓటీటీలోకి రిలీజ్ కాలేదని సమాచారం. ఈ సినిమాల ఓటీటీ రిలీజ్ కోసం మేకర్స్ అత్యధికంగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

పూజా మేరీ జాన్ సినిమాలో హుమా ఖురేషి, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే రూమీ కి షరాఫత్ సినిమాలో రాధికా మదన్ ముఖ్య పాత్ర పోషించింది. ఇక సర్వగుణ సంపన్న చిత్రంలో వాణి కపూర్, ఇష్వాక్ సింగ్, రఘువీర్ యాదవ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూడు సినిమాలకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పటికీ ఓటీటీలో మాత్రం విడుదల కాలేదు.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..