Chiranjeevi: బాలయ్యే కాదు మెగాస్టార్ కూడా అఘోరా పాత్రలో నటించారు.. ఆ సినిమా ఎదో తెలుసా..?

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలయ్య అఘోరా పాత్రలో కనిపించి మెప్పించారు. అంతకు ముందు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ విజయాలను అనుకున్నాయి. ఆ సినిమాలను మించి అఖండ సినిమా విజయం సాధించింది. ఇక అఖండ సినిమాలో శివ భక్తుడుగా బాలయ్య అద్భుతంగా నటించారు.

Chiranjeevi: బాలయ్యే కాదు మెగాస్టార్ కూడా అఘోరా పాత్రలో నటించారు.. ఆ సినిమా ఎదో తెలుసా..?
Chiranjeevi , Balakrishna

Updated on: Oct 07, 2023 | 10:20 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలయ్య అఘోరా పాత్రలో కనిపించి మెప్పించారు. అంతకు ముందు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ విజయాలను అనుకున్నాయి. ఆ సినిమాలను మించి అఖండ సినిమా విజయం సాధించింది. ఇక అఖండ సినిమాలో శివ భక్తుడుగా బాలయ్య అద్భుతంగా నటించారు. అఘోర పాత్రలో బాలయ్య యాక్షన్స్ సీన్స్ కూడా ఇరగదీశారు. ఇదిలా ఉంటే బాలకృష్ణతో పాటు చిరంజీవి కూడా ఓ సినిమాలో అఘోరా గా నటించి మెప్పించారు. ఆ సినిమా ఎదో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. చిరంజీవి చేయని పాత్ర అంటూ ఏది ఉండదేమో అనడం లో అతిశయోక్తి లేదు. పునాది రాళ్లు సినిమా నుంచి మొదలుకొని ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇక మెగాస్టార్ అఘోర పాత్రలో నటించిన సినిమా ఎదో తెలుసా అది శ్రీ మంజునాథ.

శ్రీ మంజునాథ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అర్జున్ , సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమా శివుని పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించారు. ఇక ఇదే సినిమాలో ఆయన పలు గెటప్స్ లో కనిపించారు. వాటిలోనే అఘోర గెటప్ ఒకటి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ శివునిగా.. మీనా పార్వతి దేవిగా నటించి మెప్పించారు. ఈ సినిమాకు హంసలేఖ సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాలో కన్నడ నటుడు అంబరీష్ కూడా నటించారు.

చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.