
బుల్లిరాజు అలియాస్ రేవంత్.. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఇతను చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. వెంకటేష్ కుమారుడి పాత్రలో అద్భతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడీ ఛైల్డ్ ఆర్టిస్ట్. ముఖ్యంగా తన తండ్రిని ఇబ్బందిపెట్టిన వారిపై బూతులతో రెచ్చిపోతూ ఆడియెన్స్ కు నవ్వులు పంచాడు బుల్లిరాజు. దీంతో ఒక్కసారిగా బాగా ఫేమస్ అయిపోయాడీ ఛైల్డ్ ఆర్టిస్ట్. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత శ్రీ విష్ణు సింగిల్ లాంటి కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు బుల్లిరాజు. ఇప్పుడు మళ్లీ సంక్రాంతి పండగ పూట ఆడియెన్స్ ను నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో బుల్లిరాజు నటించాడు. అలాగే నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఓ రాజు సినిమాలోనూ మెరిశాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బుల్లిరాజు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చేసిన కామెంట్స్ విని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ‘అన్ని సినిమాల్లో ఒకేలా కనిపించకూడదని కాస్త డిఫరెంట్ గా ఉండాలని డైట్ చేస్తున్నాను. అందుకే ఇప్పుడు సన్నగా మారిపోయాను. ఈ ఏడాది ఇంకా చాలా బిజీగా ఉన్నాను. సుమారు పది సినిమాల్లో నటిస్తున్నాను’ అని బుల్లిరాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ బుడతడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బుల్లిరాజు క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉండే బుల్లిరాజు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకనేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా గతేడాది ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బుల్లి రాజు తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు. తన వయసు 10 సంవత్సరాలని, ఐదో తరగతి చదుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
బుల్లిరాజు సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలో ఉన్న గనపవరం. ఇప్పుడు అక్కడే ఉన్న శ్రీ చైతన్య స్కూల్ లోనే బుల్లిరాజు ఆరో తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది.
Bulliraju = #MSG,
Anil Ravipudi = Audience. pic.twitter.com/IucLFy4vsJ— Satya (@YoursSatya) January 14, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..