
నాగదుర్గ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫోక్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుందీ అందాల తార. కేవలం పాటలే కాదు వాటికి నాగదుర్గ వేసే స్టెప్పులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ ఫోక్ సింగర్ నుంచి ఏదైనా కొత్త సాంగ్ చేస్తే చాలు యూట్యూబ్ షేక్ అవుతుంది. మిలియన్ వ్యూస్ తో రికార్డులు బద్దలవుతాయి. ‘కాపోళ్ల ఇంటికాడ’. ‘ఎర్ర ఎర్రని రుమాలు గట్టి’ , ‘తిన్న తిరం పడ్తలే’, ‘దారి పొంటొత్తుండు’,’జిల్లెలమ్మ జిట్ట’, ‘పేరు గళ్ల పెద్ది రెడ్డి’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలతో యూట్యూబ్ సెన్సేషన్ గా మారిపోయంది నాగదుర్గ. ఇలా తన పాటలు, డ్యాన్సులతో తెలుగు నాట బోలెడు అభిమానం సొంతం చేసుకున్న నాగదుర్గ ఇప్పుడు వెండితెరపైనా మెరవనుంది. ఇప్పటికే తెలుగులో కలివి వనం అనే సినిమాలో నటించిందీ బ్యూటిఫుల్ సింగర్. అలాగే తమిళంలో ‘లవ్ ఓ లవ్’ అనే సినిమా చేసింది. అయితే ఇప్పుడు హీరోయిన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనుంది నాగ దుర్గ.
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఇడుపు కాగితం. ఇందులో నాగ దుర్గ లో ‘శ్రీలత’ అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి తోడు ఇడుపు కాయితం అనే టైటిల్ పై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాగదుర్గ నేపథ్యం గురించి తెలుసుకునేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో ఆమె పాత ఇంటర్వ్యూలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగదుర్గ తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎనలేని అభిమానమని నాగ దుర్గ చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికినా చాలని డార్లింగ్ పై ప్రేమను కురిపించింది. ఇక తనకు గ్లామర్ దుస్లతుకంటే సాంప్రదాయ చీరకట్టు, హాఫ్ శారీస్ అంటేనే ఇష్టమని పేర్కొంది ఫోక్ సింగర్. అందుకే స్క్రీన్‌పై కూడా మితిమీరిన గ్లామర్‌కు ఆమె ఒప్పుకోరు. అందుకే చాలా సినిమా అవకాశాలను వదులుకుందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.