Hrithik Roshan: వార్ 2 సినిమాకు హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..? ఎన్టీఆర్ కంటే ఎంత ఎక్కువ అంటే..

ప్రస్తుతం మోస్ట్ అవైడెట్ పాన్ ఇండియా ఫిల్మ్ వార్ 2. గతంలో సూపర్ హిట్ అయిన వార్ సినిమాకు సీక్వెల్ ఇది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల తారక్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్ అంచనాలు పెంచేసింది.

Hrithik Roshan: వార్ 2 సినిమాకు హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..? ఎన్టీఆర్ కంటే ఎంత ఎక్కువ అంటే..
Hrithik Roshan

Updated on: May 22, 2025 | 5:28 PM

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న స్పై థ్రిల్లర్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ నటిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. 2019 బ్లాక్‌బస్టర్ వార్‌కి సీక్వెల్ అయిన చిత్రం ఇది. ఇందులో ఎప్పటిలాగే తన పాత్రలో కనిపించనున్నారు హృతిక్ రోషన్. అలాగే రా ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు లుక్స్, యాక్టింగ్ మరింత హైలెట్ అయ్యింది.

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు వార్ 2 సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా.. ? ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.45 కోట్లు తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత వచ్చిన దేవర సినిమాకు రూ. 60 కోట్లు తీసుకున్నారు తారక్. మొదట్లో వార్ 2 సినిమా కోసం తారక్ తన పారితోషికాన్ని రూ.30 కోట్లకు తగ్గించుకున్నాడని టాక్. ఇక తాజాగా నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 60 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. ఇక గతంలో వార్ చిత్రంలో నటించిన హృతిక్.. ఇప్పుడు మరోసారి తన ఒరిజినల్ పాత్ర కోసం రూ.48 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు.

ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ 14న హిందీతోపాటు, తెలుగు, తమిళం భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..