డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం జయం. ఈ సినిమాతో నితిన్, సదా హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రతినాయకుడిగా నటించారు. 2002 జూన్ 14న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మొదటి సినిమాతోనే నితిన్.. సదా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికీ 20 ఏళ్లు అయినా.. ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులే కాకుండా.. సదా చెల్లి పాత్రలో కనిపించిన అమ్మాయి తన నటనతో ఆకట్టుకుంది. అక్షరాలను తిప్పిరాసే అమ్మాయిగా కనిపించి మెప్పించింది. అంతేకాదు.. ఒక్క సినిమాతోనే ఏకంగా నంది అవార్డ్ గెలుచుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఆ అమ్మాయి ఎవరు ?.. ప్రస్తుతం ఏం చేస్తుంది ? అని ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఆ అమ్మాయి ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత.
సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురే జయం చైల్డ్ ఆర్టిస్ట్ యామిని శ్వేత. ఈమె కేవలం చిన్నతనంలో మాత్రమే వెండితెరపై కనిపించింది. బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న యామిని.. పెద్దయ్యాక ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ జయం కంటే ముందే బుల్లితెరపై దాదాపు 10 సీరియల్స్ చేసింది. సీతామహాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో జయం ఆడిషన్స్ కోసం ప్రకటన వచ్చింది. ఆది చూసి ఆమె తండ్రి తన ఫోటోస్ డైరెక్టర్ కు పంపారు. అలా జయం సినిమాలోకి ఎంపికైంది యామిని.ఆ తర్వాత ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి సినిమాలు చేసింది. ఈ చిత్రాల తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంది యామిని.
విదేశాల్లో మాస్టర్స్ పూర్తిచేసిన యామిని ఆ తర్వాత పెళ్లి చేసుకుని గృహిణిగా సెటిలయ్యింది. వీరికి ఓ పాప కూడా ఉంది. యామినికి పెద్దయ్యాక చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ చదువు పూర్తిచేసేందుకు వాటన్నింటిని రిజెక్ట్ చేసింది యామిని.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.