నయనతారతో ఉన్న చిన్నారి గుర్తుందా.? ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూడండి..

|

Jun 25, 2024 | 7:36 PM

ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా.. హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. నెటిజన్స్ వీరి గురించి గూగుల్ లో గాలిస్తున్నారు. అలా పై ఫొటోలో ఉన్న చిన్నారి గుర్తుందా.? నయనతార ప్రధాన పాత్రలో నటించిన అంజలి ఐపీఎస్ సినిమాలో నటించింది ఆ చిన్నారి.

నయనతారతో ఉన్న చిన్నారి గుర్తుందా.? ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూడండి..
Actress
Follow us on

చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇస్తున్నారు. నిన్నమొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసిన వారి ఇప్పుడు ఉన్నట్టుండి హీరోలు, హీరోయిన్స్ గా మారిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా.. హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. నెటిజన్స్ వీరి గురించి గూగుల్ లో గాలిస్తున్నారు. అలా పై ఫొటోలో ఉన్న చిన్నారి గుర్తుందా.? నయనతార ప్రధాన పాత్రలో నటించిన అంజలి సీబీఐ సినిమాలో నటించింది ఆ చిన్నారి. ఆ సినిమాలో ఓ పోలీసును ఈ చిన్నది బెదిరించే సీన్ హైలైట్ గా నిలిచింది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నదాని సీన్ తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ చిన్నది చాలా మారిపోయింది.

అంజలి సీబీఐ సినిమాలో నయన్ ప్రధాన పాత్రలో నటించింది. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. రెండు భాషల్లోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 50కోట్లవరకు వసూల్ చేసింది ఈ సినిమా. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించారు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు. అలాగే యంగ్ హీరో అధర్వ  నటించాడు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయన్ కూతురిగా నటించిన పాప బాగా ఫెమస్ అయ్యింది. ఈ సినిమాలో ఈ చిన్నారి ఏంటయ్యా ముగ్గురు లేడీస్ ఉన్న ఇంటికి మాటి మాటికి వచ్చి విసిగిస్తున్నావ్.. అంటూ పోలీస్ కు వార్నింగ్  ఇచ్చే సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిన్నారి పేరు మనస్వి కొట్టాచి. తమిళ్ కమెడియన్ కొట్టాచి కూతురు ఈ చిన్నారి. ఈ చిన్నది ఇప్పుడు టీనేజర్ గా మారింది. ఈ చిన్నది చాలా సినిమాల్లో నటించింది. రజనీకాంత్ దర్బార్, ఎనిమీ, ద లెజెండ్, డీడీ రిటర్న్స్, చంద్రముఖి 2 సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ చిన్నారి ఫోటోలు వైరల్ గా మారాయి.

మనస్వి కొట్టాచి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..