Vikramarkudu: విక్రమార్కుడు చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి

|

Apr 12, 2023 | 5:23 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు. విక్రమ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీరియస్ గా నటించి అలాగే సత్తిబాబు పాత్రలో కామెడీ పండించారు రవితేజ.

Vikramarkudu: విక్రమార్కుడు చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి
Vikramarkudu Child Artist
Follow us on

మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు. విక్రమ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీరియస్ గా నటించి అలాగే సత్తిబాబు పాత్రలో కామెడీ పండించారు రవితేజ. ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

సినిమాలో అమాయకమైన చూపులతో అందరిని ఆకట్టుకుంది ఈ చిన్నారి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు నేహా. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది ఈ చిన్నది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్షా అనే సినిమాలో నటించింది. ‘రక్ష’ మూవీలో తన యాక్టింగ్ తో అందరిని భయపెట్టింది.

నేహా తోటకు సంబంధించిన తాజా పిక్స్ నెట్టింటో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మడు సినిమాలకు దూరమైంది. పై చదువు కోసం ఈ అమ్మడు సినిమాలకు దూరమైంది. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.