G V Prakash Kumar: జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా? తెలుగులోనూ బాగా ఫేమస్

కోలీవుడ్ స్టార్ జీవీ ప్రకాశ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అతను కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా హీరోగానూ సత్తా చాటుతున్నాడు. అయితే జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి కూడా ఫేమస్ హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు.

G V Prakash Kumar: జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా? తెలుగులోనూ బాగా ఫేమస్
G V Prakash Kumar Sister Bhavani Sre

Updated on: Jan 25, 2026 | 11:03 AM

ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యాడు జీవీ ప్రకాశ్ కుమార్. మొదట సంగీత దర్శకుడిగా వచ్చిన అతను ఆ తర్వాత హీరోగానూ మారిపోయాడు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూనే మరోవైపు పలు క్రేజీ ప్రాజెక్టుల్లో హీరోగా నటిస్తున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. అయితే ఇతని సోదరి కూడా ఫేమస్ హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె పేరు భవానీ శ్రీ. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయమే. ఆ మధ్యన అక్కినేని అమల కీలక పాత్రలో నటించిన ఓ వెబ్ సిరీస్ లోనూ కీ రోల్ చేసింది భవాని. అలాగే సాయి పల్లవి, ప్రకాశ్ రాజ్ నటించిన పావ కథైగల్ అనే వెబ్ సిరీస్ లోనూ ఓ ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది.

ఇక భవాని శ్రీకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా విడుతలై (విడుదల) అని చెప్పుకోవచ్చు. వెట్రి మారన్- విజయ సేతుపతి కాంబినేషన్ లో వచ్చిన విడుదలై చిత్రంలో కొండవాసి యువతిగా నటించి మెప్పించిందీ అందాల తార. ఇందులో ఆమె అభినయానికి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇక లేటెస్ట్ గా హాట్‌స్పాట్‌ 2 మచ్‌ అనే మరో డిఫరెంట్ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది భవాని శ్రీ. ఇప్పటివరకు చాలా తీవ్రమైన, సీరియస్‌ కథా పాత్రలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో మొదటి సారిగా ఓ మోడ్రన్ అమ్మాయి రోల్ లో కనిపించింది. విగ్నేష్‌ కార్తీక్‌ తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం (జనవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో భవాని శ్రీ అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.

ఇవి కూడా చదవండి

కొత్త సినిమా ప్రమోషన్లలో భవాని శ్రీ..

‘హాట్‌స్పాట్‌ 2మచ్‌ సినిమా నాకు ఒక మంచి మార్పుగా అనిపించింది. ఈ మూవీ ద్వారా తొలిసారిగా లైట్‌ హార్టెడ్‌ సినిమాలోకి అడుగుపెట్టాననిపించింది. జెన్‌ జెడ్ తరానికి చెందిన ఆధునిక అనుబంధాలతో, చిన్న చిన్న ఫాంటసీ సన్నివేశాలతో సాగే ప్రేమ కథ చిత్రమిది. ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా ఎగ్జెయిటెడ్ గా ఫీలయ్యాను. అలాగే అశ్విన్ తో కలిసి నటించడం చాలా సంతృప్తిగా అనిపించింది. ఇకపై కూడా సరికొత్త కథా పాత్రల్లో నటించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను’ అని అంటోందీ అందాల తార.

భవాని శ్రీ మరిన్ని ఫొటోస్, వీడియోలు…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.