Nana Patekar: ఈ నటుడి భార్య గురించి తెలిస్తే షాకే.. సినిమాల కోసం IIT వదిలేసి.. ఇప్పుడు..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన టాప్ నటుడు. ఒకప్పుడు హీరోగా అనేక చిత్రాల్లో మెప్పించిన ఆయన.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధంలో చేరి దేశానికి సేవ చేశాడు. ఇక ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన మరెవరో కాదు.. నానా పటేకర్.

Nana Patekar: ఈ నటుడి భార్య గురించి తెలిస్తే షాకే.. సినిమాల కోసం IIT వదిలేసి.. ఇప్పుడు..
Nana Patekar, Neelakanti

Updated on: Jun 01, 2025 | 1:47 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్ నానా పటేకర్. మరాఠీ, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించాడు. 1978లో గర్మాన్ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన.. సలాం బాంబే, పరిందా, క్రాంతివీర్, ప్రహార్: ది ఫైనల్ అటాక్, రాజు బన్ గయా జెంటిల్‌మన్, అంగార్, అగ్ని సాక్షి, ఖామోషి: ది మ్యూజికల్ (1996) వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో మెప్పించాడు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో టాప్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. కోట్లు వదిలేసి మహారాష్ట్రలో ఓ పల్లెటూరిలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం ఆయన మాత్రమే కాదు.. నానా పటేకర్ భార్య సైతం ఇండస్ట్రీలో ఫేమస్ వ్యక్తి. ఆమె పేరు నీలకంటి పటేకర్.

నానా పటేకర్, నీలకంటి మొదటిసారి ఒక మరాఠీ నాటకంలో కలుసుకున్నారు. ఆ నాటకానికి ఆమె రెండున్నర వేల పారితోషికం అందుకుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1978లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి బాబు జన్మించాడు. కానీ రెండున్నర వయసులోనే అతడు అనుహ్యంగా మరణించాడు. ఆ తర్వాత మరో కుమారుడు జన్మించారు. అతడి పేరు మల్హార్. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన నీలకంటి తండ్రి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీలకంటి.. ఐఐటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి అత్యధిక మార్కులు సాధించింది. కానీ అదే సమయంలో నటనవైపు ఆసక్తి కలగడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

1973లో మహారాష్ట్ర రాష్ట్ర నాటక పోటీలో ఉత్తమ నటిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది. అంతేకాకుండా, 1989లో ఆత్మ విశ్వాస్ చిత్రానికి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది . పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. 2024లో ఛావా సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ధరౌ పాత్రను పోషించింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇండస్ట్రీలోకి తిరిగి వచ్చిన ఆమె మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..