మంచి స్కిల్ కనబరిస్తే చాలు.. తెలుగు మేకర్స్.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి.. మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేస్తారు. వారిలోని ప్రతిభను మరింత బయటపెట్టేలా పాత్రలు రూపుదిద్దుతారు. ప్రజంట్ టాలీవుడ్‌లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. సినిమాల్లో తమ మార్క్ నటన, టైమింగ్‌తో ఆడియెన్స్ మెప్పు పొందుతున్నారు. ఈ మధ్య అలా పేరు తెచ్చుకున్నవారిలో ఒకరు గోపరాజు రమణ. ఆయన టైమింగ్ నెక్ట్స్ లెవల్ అంతే. ముఖ్యంగా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో ఆనంద్ దేవరకొండ తండ్రిగా నటించిన అదరగొట్టేశాడు. నటుడిగా అతనిలోని క్యాలిబర్ ఏంటో ఈ సినిమాతో తెలిసిపోయింది. ఆ లెవల్‌లో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశాడు. తన మార్క్ టైమింగ్‌తో వారెవ్వా అనిపించాడు. గోపరాజు రమణ.. 2004లోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. చాలా సినిమాల్లో నటించాడు. కానీ తనకు తగ్గ పాత్ర, గుర్తింపు రాలేదు. మిడిల్ క్లాస్ మెలోడీస్ మాత్రం అతని దశను, దిశను మార్చేసింది. ఆ సినిమాతో ఆయన తెగ బీజీ అయిపోయాడు. 72 ఏళ్ల వయస్సులోనూ పాత్రల్లో పెర్ఫామెన్స్‌తో చించి ఆరేస్తున్నాడు. కొన్ని సినిమాలకు డేట్స్ కూడా కేటాయించలేని పరిస్థితి వచ్చేసిందట.
మీకు ఇంకో విషయం తెలుసా.. గోపరాజు రమణ కొడుకు కూడా టాలీవుడ్‌లో నటుడిగా రాణిస్తున్నారు. ఆయన పేరు గోపరాజు విజయ్. ఆయన గుంటూరు కారంతో పాటు.. ఆరంభం, సామజవరగమన, బృందా, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చిత్రాల్లో నటించాడు. ఆయన కూడా ఇప్పుడిప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ అయ్యారు. కాగా ఈ తండ్రీ కొడుకులిద్దరూ.. దశాబ్ధాలుగా రంగస్థలంపై నటులుగా రాణిస్తుండటం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.