Anchor Syamala: యాంకర్ శ్యామల భర్త కూడా ఓ నటుడే.. ఆమె ఇల్లు చూస్తే ఇంద్రభవనమే..

|

Jan 26, 2023 | 9:58 AM

ఇంట్లో లైటింగ్‌ కోసం చాలా ఖర్చుపెట్టారట శ్యామల. రాత్రి వేళ తన ఇంటిని చూస్తే మరింత అందంగా ఉంటుందట. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మా ‘ఇంటి కల’ నెరవేరిందని శ్యామల చెప్పుకొచ్చింది.

Anchor Syamala: యాంకర్ శ్యామల భర్త కూడా ఓ నటుడే.. ఆమె ఇల్లు చూస్తే ఇంద్రభవనమే..
Anchor Shyamala
Follow us on

ప్రముఖ యాంకర్‌గా.. గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్యామల. ఆమె మాటల గారడితో ఇట్టే ఆకట్టుకుంటుంది. అటు సినిమాల్లోనూ అడపా దడపా నటిస్తోంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్యామల కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. ఆపై సినిమాల్లో ట్రై చేసినా.. పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఈ సమయంలో బుల్లితెరపై యాంకర్‌గా మారి ఫుల్ సక్సెస్ అయ్యింది. సినిమాల ప్రమోషన్ కోసం సుమ కాకుండా నెక్ట్స్ ఆప్షన్ ఎవరంటే… శ్యామల పేరే చెబుతున్నారు చాలామంది. అయితే శ్యామలకు పెళ్లైందా…? పిల్లలున్నారా అనేది చాలామందికి డౌట్. అబ్బాయిల హార్ట్ బ్రేక్ అయ్యే విషయం ఏంటంటే.. ఆమెకు ఎప్పుడో పెళ్లైయ్యింది. ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రముఖ సీరియల్ యాక్టర్..  నరసింహారెడ్డి శ్యామల భర్త. ఈమె ప్రజంట్ తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూనే… ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తోంది.

అటు ఈవెంట్లు.. ఇటు సినిమా ప్రమోషన్స్.. మరోవైపు యాక్టింగ్.. ఇలా బాగానే సంపాదించింది శ్యామల. మరోవైపు భర్త సంపాదన కూడా ఉంది. పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా తన డ్రీమ్ హౌస్‌ను సిటీకి కాస్త దూరంగా నిర్మించుకుంది. నిజంగా ఆచి.. తూచి ఇళ్లంతా డిజైన్ చేశారు. శ్యామల ఇల్లు ఓ చిన్నపాటి ఇంద్రభవనాన్నే తలపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఆశీర్వాదం, ప్రోత్సాహం వల్ల తమ సొంతింటి కల నెరవేరిందని గతంలో ఆనందం వ్యక్తం చేశారు శ్యామల. ఆమె గతంలో తన ఇంటి గురించి వివరాలు వెల్లడిస్తూ హోమ్ టూర్ వీడియో కూడా చేశారు. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..