అక్కినేని నాగార్జున హీరోగా, దర్శకుడు మణిరత్నం తెరక్కించిన ‘గీతాంజలి’ మూవీ గుర్తుందా.? మణిరత్నం మూవీల్లో ఇదొక క్లాసిక్. వర్సటైల్ డైరెక్టర్ నుంచి వచ్చిన ఈ ట్రాజెడీ లవ్ స్టోరీ.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్. ఇందులో హీరోయిన్‌గా నటించింది గిరిజ సెట్టార్. ఆమెకు అది మొదటి సినిమా అయినా.. ఎక్కడా అలా కనిపించదు. ప్రేమ కోసం పరితపించే సగటు అమ్మాయిగా ఆమె కనబరిచిన నటన.. ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. మొన్న మే 12వ తేదీకి ‘గీతాంజలి’ సినిమా వచ్చి 25 ఏళ్లు అయింది. మరి ‘ఇందు’ పాత్రలో అప్పుడు నటించి మెప్పించిన గిరిజ.. ఇప్పుడు ఎక్కడ ఉందో..? ఎలా ఉందో మీకు తెలుసా.? ఆమె ప్రస్తుతం మెడిటేషన్ కోచ్‌గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆమెను చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. నమ్మలేని విధంగా చేంజ్ అయిపోయింది.
ప్రస్తుతం లా గ్రేస్ శ్రీ అరబిందో ఇంటెగ్రల్ లైఫ్ సెంటర్ పేరుతో మెడిటేషన్ క్లాసెస్ చెబుతోంది గిరిజా సెట్టార్. 1969వ సంవత్సరంలో బ్రిటన్‌లో జన్మించిన గిరిజ సెట్టార్.. భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. 2003లో యోగా తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మనస్తత్వశాస్త్రంలో డాక్టరల్ థీసెస్ పూర్తి చేసింది. ఆమె తెలుగులో ‘గీతాంజలి’ మూవీతో పాటు ‘హృదయాంజలి’ అనే సినిమాలోనూ నటించింది. తెలుగు మాత్రమే కాదు.. మలయాళం, హిందీ భాషల్లో కూడా చెరో రెండు చిత్రాలు చేసింది. 2003వ సంవత్సరం నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పి.. పూర్తిగా మెడిటేషన్ వైపే మళ్లింది గిరిజ. ప్రస్తుతం దేశవిదేశాల్లో యోగా క్లాసెస్ చెబుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం..