పొలిమేర మూవీలో గెటప్ శ్రీను భార్య ఈమేనా.! ఈ రేంజ్‌లో అదరగొడుతుందేంటీ..!!

|

Apr 15, 2024 | 12:26 PM

హాలీవుడ్ కు ధీటుగా తెలుగులోనూ చాలా వెబ్ సిరీస్‌లు, సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులను థ్రిల్ అయ్యేలా చేసిన సినిమాల్లోమా ఊరి పొలిమేర సినిమా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

పొలిమేర మూవీలో గెటప్ శ్రీను భార్య ఈమేనా.! ఈ రేంజ్‌లో అదరగొడుతుందేంటీ..!!
Tollywood
Follow us on

ఓటీటీలు వచ్చిన తర్వాతప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఓ వైపుడు థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తుంటే.. ఓటీటీలో వెబ్ సిరీస్ లు, సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ కు ధీటుగా తెలుగులోనూ చాలా వెబ్ సిరీస్‌లు, సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులను థ్రిల్ అయ్యేలా చేసిన సినిమాల్లోమా ఊరి పొలిమేర సినిమా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై భోగేంద్రగుప్త నిర్మించిన ఈ సినిమాకు డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించాడు.

మా ఉరి పొలిమేర సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మా ఉరి పొలిమేర 2 ను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. పొలిమేర 2 కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల సత్యం రాజేష్ కు జోడీగా నటించింది. ఈ సినిమాలో సత్యం రాజేష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే కామాక్షి భాస్కర్ల కూడా చాలా నేచురల్ గా నటించి మెప్పించింది. అలాగే ఈసినిమాలో గెటప్ శ్రీను భార్యగా నటించిన అమ్మడు గుర్తుందా.? ఆమె పాత్ర కూడా సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది.

రాములు పాత్రలో నటించిన ఆ నటి పేరు సాహితి దాసరి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా సాహితి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అలాగే సింగర్ సునీత కొడుకు హీరోగా నటించిన సర్కారు నౌకరి అనే సినిమాలోనూ నటించింది సాహితి. చిన్న చిన్న సినిమాలతో పాపులారిటీ పెంచుకుంటోన్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగా ఉంది. అందుకు తగ్గట్టుగానే ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

సాహితి దాసరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సాహితి దాసరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.