Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..

సాధారణ అమ్మాయి.. నటిగా తనను తాను వెండితెరపై చూసుకోవాలని కలలు కన్నది. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 18 ఏళ్లకే వరుస హిట్స్ అందుకుని ఇండస్ట్రీని షేక్ చేసింది. కానీ ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేయడంతో మానసికంగా కుంగిపోయింది. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయింది..

Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..
Jiah Khan

Updated on: Dec 20, 2025 | 8:53 AM

సినీరంగంలో ఎంతో మంది నటీనటులు చిన్న వయసులోనే తనువు చాలించారు. స్టార్ హీరోహీరోయిన్లుగా ఎదగాల్సినతారలు మానసిక ఒత్తిడితో సూసైడ్ చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఉదయ్ కిరణ్, సిల్క్ స్మిత ఇలా చాలా మంది నటీనటుల మరణాలు ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటే. తమ నటనతో మెప్పించిన ఈ తారలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అమ్మాయి సైతం 18 ఏళ్ల వయసులోనే సినీరంగంలో చెరగని ముద్ర వేసింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లల్లోనే ఏకంగా అమితాబ్ బచ్చన్ సరసన నటించి నటిగా ప్రశంసలు అందుకుంది. 64 ఏళ్ల నటుడితో 20 ఏళ్ల యువతి ప్రేమకథతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నటిగా ఎదుగుతున్న సమయంలోనే ప్రియుడి మోసాన్ని భరించలేకపోయింది. కోరుకున్న ప్రేమ అబద్ధమని తెలియడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతో 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణంతోపాటు అటు సినీపరిశ్రమ, ఇటు అభిమానులు షాకయ్యారు.

ఇప్పటికీ ఆమె మరణం వీడని మిస్టరీ. హిందీలో కేవలం మూడు సినిమాలతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆమె బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది. కానీ అబద్ధపు ప్రేమకు బలైపోయింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ జియా ఖాన్. 1988 ఫిబ్రవరి 20న న్యూయార్క్ లో జన్మించింది. తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి దగ్గరే పెరిగింది. చిన్నప్పుడే కథక్, సల్సా, బ్యాలే వంటి డ్యాన్స్ నేర్చుకుంది. చదువు మధ్యలోనే ఆపేసి 2007లో నిశ్శబ్ద్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. తనకంటే 45 ఏళ్ల పెద్దవాడైనా లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ సరసన నటించింది.

హిందీలో మూడు సినిమాల్లో నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆమె నటించిన సినిమాలు ఏకంగా రూ.300 కోట్లు రాబట్టాయి. అయితే అప్పటికే వరుస ప్రాజెక్టులు ఆఫర్స్ వస్తున్న సమయంలోనే అనుహ్యంగా 2013న జూన్ 3న ముంబైలోని తన ఫ్లాట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆమె రాసిన 6 పేజీల సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టింది. నటుడు సూరజ్ పంచోలితో ప్రేమలో ఉన్న జియా ఖాన్.. అతడు మోసం చేయడం, వేధింపులకు గురిచేయడంతో మానసికంగా కుంగిపోయింది. ఒకవేళ జియా ఖాన్ బతికి ఉంటే.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయ్యేది అంటున్నారు ఫ్యాన్స్.

Jiah Khan Films

ఇవి కూడా చదవండి : Akhanda 2: అఖండ2లో బాలయ్య కూతురిగా నటించాల్సిన అమ్మాయి ఈమె కాదట.. స్టార్ హీరో కూతురు మిస్సైందిగా..