Tollywood: చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్.. ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో ఆమె సెన్సేషన్.. ఎవరంటే..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కంటెంట్ బలం, పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్.. ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో ఆమె సెన్సేషన్.. ఎవరంటే..
Radhika Sharath Kumar

Updated on: May 21, 2026 | 3:14 PM

సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. తమకు నచ్చిన తారల బాల్యం జ్ఞాపకాలను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. పైన ఫోటోను చూశారు కదా. అందులో కనిపిస్తున్న చిన్నారి ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని శాసించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో అనేక హిట్స్ చేసి మెప్పించింది. గ్లామరస్ పాత్రలు కాదు.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసింది. ఇటీవల ఆమె నటించిన ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి దాదాపు రూ.70 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆమె సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి తెరంగేట్రం చేసింది. ఆమె తండ్రి తోపు కమెడియన్. తల్లిదండ్రులు, సోదరుడు అందరూ సినీరంగానికి చెందినవారే.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu: మహేష్ బాబును అన్నయ్య అని పిలిచిన ఏకైక హీరోయిన్.. హీరో రియాక్షన్ తెలిస్తే..

అందుకే చిన్న వయసులోనే తెరంగేట్రం చేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు భారతిరాజా ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. తన అద్భుతమైన నటనతో, డ్యాన్స్ తో పాపులర్ అయ్యింది. అలాగే అటు రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదండి హీరోయిన్ రాధిక శరత్ కుమార్. తమిళంలో హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎంఆర్ రాధా కుమార్తె. రాధిక 1978లో భరతిరాజా దర్శకత్వం వహించిన ‘కిళక్కే పోగుం రైల్’ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..

ఇప్పటివరకు కథానాయికగా, సహాయ నటిగా అలరించిన రాధిక.. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించన తాయ్ కిళైవి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాధిక తదుపరి సూర్య చిత్రం ‘విష్ణనాథన్ అండ్ సన్స్’లో కనిపించనుంది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసిన రాధిక పలు సీరియల్స్ చేసింది. ఆమె 2024 పార్లమెంటరీ ఎన్నికలలో బీజేపీ తరపున విరుదునగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రకాష్ రాజ్ సినిమాలో ఛాన్స్ అన్నారు.. ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Sravana Bhargavi: ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కామన్.. కానీ చివరకు.. తల్లి కూతురు మధ్యలో అలాంటివి.. శ్రావణ భార్గవి..

Follow Us