
కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విజయ్ బిన్ని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
విజయ్ బిన్ని మాట్లాడుతూ.. దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి వచ్చాను. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చూసిన తర్వాత అన్నీ క్రాఫ్ట్స్ బాగా చేశారు. కొరియోగ్రాఫర్ కి ఆ గ్రిప్ ఉంటుందని భావించి కొన్నాళ్ళు కొరియోగ్రఫీ వైపు వెళ్లాను. ఇంతకుముందు నాగార్జున గారికి పాటలు చేశాను. సినిమా కూడా చాలా హ్యాపీ గా చేసుకుంటూ వెళ్లాం. దర్శకుడిగా తొలి సినిమాని నాగార్జున గారితో చేయడం నా అదృష్టం. నాకు మొదటి నుంచి డైరెక్షన్ పైనే ఆసక్తి వుంది. కొరియోగ్రఫీ కూడా ఎక్కువ స్టొరీ టెల్లింగ్ వున్న పాటలు, మాంటేజస్ చేశాను. సరైన సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా అంతా సజావుగా జరిగింది.
ముందు నాగార్జున గారితో ఒక సినిమా చేయాలని ఆయనకి కథ చెప్పాను. అప్పుడు ఆయన ఈ కథ గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఈ కథని ఓన్ చేసుకొని నా స్టయిల్ లో చేశాను. ఈ సినిమాలో చాలా హైస్ వుంటాయి. వింటేజ్ నాగార్జున గారు కనిపిస్తారు. నేను నాగార్జున గారిని ఎంత డిఫరెంట్ గా చూపించాలని అనుకున్నానో అంత కొత్తగా ప్రజెంట్ చేశానని భావిస్తున్నాను. ఇదొక ఫ్రెండ్షిప్ మూవీ. నరేష్ గారికి నాగార్జున గారంటే పిచ్చి. వారిద్దరిని ఈ కథలో పెడితే బావుంటుందనిపించింది. నరేష్ గారు అద్భుతంగా చేశారు, వీరితో పాటు మరో యంగ్ యాక్టర్ వుండాలి. ఆ పాత్రకు రాజ్ తరుణ్ ని తీసుకున్నాం. ఇందులో ముగ్గురికి ఒకొక్క కథ వుంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అయి వున్నాయి? వాళ్ళ మధ్య జరిగిన సిస్ట్యువేషన్స్ ఏమిటనేది చాలా కొత్తగా వుంటాయి అని తెలిపాడు దర్శకుడు విజయ్ బిన్ని.
The soul of #NaaSaamiRanga @mmkeeravaani s magic!!💐
Maa Anji Gadidhi Naadhi Vidadiyyani Oka Bhandam!❤️#WhistleThemeSong From #NaaSaamiRanga
▶️ https://t.co/kl3Rg1vDU1#NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi@allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.