68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటనలో తెలుగు సినిమాలు సత్తాచాటాయి. మూడు సినిమాలకు జాతీయ అవార్డులు దక్కాయి. వీటిలో చిన్న సినిమా గా వచ్చి ప్రేక్షకుల ఆదరణ అందుకున్న ‘కలర్ ఫోటో'(Colour Photo) సినిమాకు బెస్ట్ మూవీ అవార్డు వరించింది. పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ రాజ్ డైరెక్ట్ చేశారు. సుహాస్, షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ చాందినీ చౌదరీ హీరో హీరోయిన్లుగా నటించారు. పోలీస్ క్యారెక్టర్లో.. పవర్ ఫుల్ విలన్‌గా సునీల్ కనిపించారు. ఇక ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడం తో చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి హాజరయ్యి చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ..
‘కలర్ ఫోటో సినిమాకు అవార్డు రావడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది అన్నారు. ఇది కలర్ ఫోటోకు మాత్రమే కాదు.. ఇది సెలెబ్రేషన్స్ తెలుగు సినిమా. అవార్డును ప్రకటించిన తరువాత వచ్చిన కాల్స్, మీ ఎమోషన్స్ అన్నీ కూడా చూస్తున్నాను. ఇలాంటి గుర్తింపు వస్తుంటే.. దీని కోసం ఎంతైనా కష్టపడొచ్చని అనిపిస్తుంది అని వంశీ అన్నారు. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో కలర్ ఫోటో 68వ సినిమాగా నిలిచింది. ఇది అందరికీ గర్వకారణం. విజ్ఞాన్ భవన్‌లో అవార్డు అందుకునే సమయంలో కలిగే ఫీలింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేషనల్ అవార్డు అనేది మన ఇంటి గోడ మీదుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. రూంలో కెమెరాలు పెట్టుకుని చిన్న చిన్న స్కిట్లు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు.
సుహాస్, సందీప్, సాయి రాజేష్, కాళ భైరవ వంటి వారు ముందుకు వచ్చారు. నిజాయితీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్యాషన్, కమిట్మెంట్, హార్డ్ వర్క్‌తోనే టీం అంతా కలిసి పని చేయడంతోనే ఈ గుర్తింపు వచ్చింది. క్లైమాక్స్‌లో చాందినీ నటనను చూసి నా కంట్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఈ సినిమా స్థాయి అర్థమైంది. పదేళ్లు అయినా కూడా ఈ సినిమా టీవీల్లో వస్తే సందీప్‌కు అందరూ మెసెజ్‌లు చేస్తారు. మంచి కంటెంట్ ఇచ్చేందుకు అందరూ ప్రయత్నిస్తారు. సందీప్, సాయి రాజేష్ నెక్ట్స్ సినిమాల గురించి నేను ఎదురుచూస్తున్నాను. అల వైకుంఠపురములో సినిమాకు గానూ తమన్‌కు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆహా, కలర్ ఫోటో టీంకు కంగ్రాట్స్’ అని అన్నారు వంశీ పైడిపల్లి.