ఆ బ్లాక్ బస్టర్ సినిమాను అతను తప్ప మరెవరూ చేయలేరు.. ఓపెన్‌గా చెప్పిన సుకుమార్

ఆర్య, ఆర్య 2, రంగస్థలం, పుష్ప 1, 2 సినిమాలతో భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించారు డైరెక్టర్ సుకుమార్. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ బ్లాక్ బస్టర్ సినిమాను అతను తప్ప మరెవరూ చేయలేరు.. ఓపెన్‌గా చెప్పిన సుకుమార్
Sukumar

Updated on: Jan 24, 2026 | 7:54 PM

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు. పుష్ప , పుష్ప 2 సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నారు సుకుమార్. ఇక ఇప్పుడు సుకుమార్ ఎవరోతో సినిమా చేయనున్నారా అని ఆసక్తి అందరిలో నెలకొంది. ఇదిలా ఉంటే సుకుమార్ ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ హీరో పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. ఇంతకూ సుకుమార్ చెప్పింది ఎవరి గురించంటే.. సుకుమార్ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి. రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమా ఓ మైలు రాయిగా నిలిచింది. ఈ సినిమాలో చరణ్ నటనకు అందరూ ఫిదా అయ్యారనే చెప్పాలి.

రంగస్థలం సినిమా విడుదలై ఏళ్లయినా, దాని ప్రభావం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రామ్ చరణ్ వంటి మాస్ హీరోకి కేవలం సైకిల్‌పై సాధారణ ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయం వెనుక తన ఆలోచనను సుకుమార్ పంచుకున్నారు. అటువంటి ఇంట్రడక్షన్ వల్ల ప్రేక్షకులు నిరాశపడతారనే ఆలోచన తనకు రాలేదని, అది కథలో భాగంగా, హీరో దేనికోసం వెతుకుతున్నాడనే ఆసక్తి పెంచేలా ఉండాలని కోరుకున్నానని సుకుమార్ తెలిపారు. ఈ సినిమా రామ్ చరణ్ తప్పించి వేరే ఎవరూ చేయలేరు అని సుకుమార్ అన్నారు. చాలా మంది దర్శకులు తమ ప్రతి సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని, అయితే తన విషయంలో అది వేరు అని ఆయన అన్నారు.

ఒక దర్శకుడికి సినిమా పూర్తయిన తర్వాత కూడా, ఆ పాత్రకు మరెవరూ సరిపోలేరని, ఆ ఆర్టిస్ట్ తన మనసును పూర్తిగా ఆక్రమించేశాడని అనిపిస్తే, అది ఆ నటుడి గొప్ప విజయమని సుకుమార్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా రామ్ చరణ్ తనను పూర్తిగా ఆక్యుపై చేశారని ఆయన పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, తారక్ వంటి ఇతర స్టార్లతో రామ్ చరణ్‌ను పోల్చడం సరైనది కాదని ఆయన అన్నారు. వివిధ నటులు వివిధ స్క్రిప్ట్‌లు, కథలలో పని చేస్తారని, ఒకరి పనిని మరొకరితో పోల్చుకోవడం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు. వారంతా అద్భుతమైన నటులని సుకుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..