Dasara: నాని సూపర్ హిట్ దసరా సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..

|

Apr 02, 2023 | 2:50 PM

నాని, కీర్తి సురేష్ మాస్ యాక్షన్ తో అదరగొట్టేశారు. మునుపెన్నడూ కనిపించనంతగా ఈ సినిమాలో కనిపించి మెప్పించాడు నాని. మొదటి షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

Dasara: నాని సూపర్ హిట్ దసరా సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..
Dasara
Follow us on

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. నాని, కీర్తి సురేష్ మాస్ యాక్షన్ తో అదరగొట్టేశారు. మునుపెన్నడూ కనిపించనంతగా ఈ సినిమాలో కనిపించి మెప్పించాడు నాని. మొదటి షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ మూవీ భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ .. 100కోట్ల క్లబ్ వైపు అడుగులేస్తోంది. ఈ సినిమా పై నాని మొదటి నుంచి గట్టి నమ్మకంతో ఉన్నారు.  ఆ నమ్మకమే నిజమైంది దసరా సినిమా మంచి హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే నాని కంటే ముందు ఈ సినిమాకు హీరోగా మరో యంగ్ హీరోని అనుకున్నాడట శ్రీకాంత్. ఈ యంగ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. అయితే దసరా కథను ముందుగా రామ్ చరణ్ కోసం అనుకున్నాడట శ్రీకాంత్. రంగస్థలం సినిమాకు శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. ఆ సమయంలోనే రామ్ చరణ్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడట. అయితే పెద్ద హీరో కథ అని వెనకడువేశాడట.

ఆ తర్వాత నితిన్ తో దసరా సినిమా చేయాలనీ అనుకున్నాడట. ఈ మేరకు నితిన్ ను కూడా సంప్రదించాడట. అయితే నితిన్ రిజెక్ట్ చేయడంతో నాని దగ్గరకు వెళ్లిందట ఈ కథ. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ.. నితిన్ చేసి ఉంటే కచ్చితంగా తన ఖాతాలో ఓ హిట్ పడుండేది.  ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది.