
గేమ్ చేంజర్ షూటింగ్‌కు బ్రేక్ రావటంతో ఇండియన్ 2 మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు శంకర్. ఈ సినిమాతో మరో బిగ్ హిట్‌ను టార్గెట్ చేసిన దర్శకుడు, సక్సెస్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో చనిపోయిన ఇద్దరు టాప్ స్టార్స్‌ను మరోసారి చూపించబోతున్నారట శంకర్. ఇండియన్ 2 వర్క్ ఆల్రెడీ 80 శాతం వరకు పూర్తయ్యింది. విక్రమ్ సక్సెస్ తరువాత మరో భారీ హిట్‌ను టార్గెట్ చేసిన కమల్ హాసన్ ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. శంకర్ కూడా ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. ఇండియన్ 2 విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న శంకర్, సెంటిమెంట్స్‌ను కూడా రిపీట్ చేస్తున్నారు. తన లక్కీ స్టార్స్‌ను ఈ సినిమాలో చూపించేందుకు టెక్నాలజీని నమ్ముకుంటున్నారు. భారతీయుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నారు నెడుముడి వేణు. ఆయన ఈ మధ్యే చనిపోయినా.. ఆ క్యారెక్టర్‌ను ఇండియన్ 2లోనూ కంటిన్యూ చేస్తున్నారు.
తొలి భాగంలో మెయిన్ రోల్‌లో కనిపించిన వేణు, సీక్వెల్‌లో మాత్రం గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారట. అందుకోసం లేటెస్ట్ టెక్నాలజీతో చనిపోయిన వేణును లైవ్‌లో చూపించబోతున్నారు. ఆల్రెడీ అందుకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది.
వేణుతో పాటు మరో దివంగత నటుడు వివేక్‌ను కూడా సిల్వర్ స్క్రీన్ మీద రిక్రియేట్ చేయబోతున్నారు. శంకర్ రూపొందించిన సూపర్ హిట్ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన వివేక్ ఇండియన్ 2లోనూ కనిపించబోతున్నారు. శంకర్ సెంటిమెంట్ కోసం చేస్తున్నా… ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నటులను మరోసారి తెర మీద చూడబోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.