
పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఇప్పుడు రెండు భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ కాగా.. మరొకటి లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయిన అనివార్య కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూలై 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ టీం. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ 2 ఆడియో లాంఛ్ కార్యక్రమం చెన్నైలో శనివారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో మూవీటీంతోపాటు పలువురు స్టార్ట్ సందడి చేశారు. ఈ వేడుకలో డైరెక్టర్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హీరోయిన్ కాజల్ అభిమానులకు నిరాశను మిగిల్చాయి.
ఇండియన్ 2 చిత్రంలో కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషించారు. ఈ క్రమంలో తాజాగా కాజల్ పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో కాకుండా ఇండియన్ 3లో ఆమె పాత్ర చేసిన సన్నివేశాలు ఉంటాయన్నారు. దీంతో కాజల్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఎందుకంటే పెళ్లి, పిల్లలు అంటూ చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా కాజల్.. ఇప్పుడు మొదటిసారి కమల్ హాసన్‌తో కనిపించనుంది. దీంతో ఇండియన్ 2 సినిమాను చూసేందుకు కాజల్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమాలో కాజల్ సీన్స్ ఉండవు అని తెలిసే సరికి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
ఇండియన్ 2 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో ఎస్జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.