Animal : నువ్వు మాములోడివి కాదు బాసూ.. 7 ఏళ్ల కొడుక్కి యానిమల్ సినిమా చూపించిన సందీప్ రెడ్డి వంగ

కలెక్షన్స్ పరంగానూ యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 900 కోట్ల రూపాయలను కలెక్ట్  చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో 'యానిమల్' సినిమా సందడి చేస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ కొంతమంది ఈ సినిమా పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. 

Animal : నువ్వు మాములోడివి కాదు బాసూ.. 7 ఏళ్ల కొడుక్కి యానిమల్ సినిమా చూపించిన సందీప్ రెడ్డి వంగ
Animal

Updated on: Feb 07, 2024 | 8:15 PM

యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యానిమల్ సినిమా పై చాలా మంది విమర్శలు గుప్పించినా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగానూ యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 900 కోట్ల రూపాయలను కలెక్ట్  చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో ‘యానిమల్’ సినిమా సందడి చేస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ కొంతమంది ఈ సినిమా పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.  అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. పిల్లలు ఈ సినిమా చూడలేరు అని అంటున్నారు.

తాజాగా దర్శకుడు సందీప్ తన 7 ఏళ్ల కొడుక్కి ‘ యానిమల్ ’ సినిమా చూపించాడు . కానీ సినిమాలోని అన్ని సీన్లు చూపించలేదు. యానిమల్ సినిమాలో ఎక్కువ హింస, అసభ్యకరమైన పదజాలం, మహిళలను దూషించే సన్నివేశాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్ల లోపు ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేరు. ఐతే సందీప్ రెడ్డి వంగ సినిమాలోని ‘ఎ’ రేటింగ్ ఉన్న సీన్లన్నీ మినహాయించి కొడుకుకు సినిమా చూపించాడు.

సందీప్ రెడ్డి వంగా కొడుకుకు అర్జున్ రెడ్డి అని పేరు పెట్టాడు. కొడుకుతో పాటు తన భార్యకు కూడా సినిమా చూపించాడు సందీప్ రెడ్డి. మహిళలకు వ్యతిరేకం అనేదేమీ లేదన్న అభిప్రాయం తన భార్య నుంచి వచ్చిందని సందీప్ రెడ్డి వంగ తెలిపారు. ఈ సినిమా OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చూసిన చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

రణబీర్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, బాబీ డియోల్, అనిల్ కపూర్ తదితరులు నటించిన ‘యానిమల్’ సినిమాపై పలువురు విమర్శలు గుప్పించారు. యానిమల్ విజయం తర్వాత సందీప్ రెడ్డి వంగ పలు మీడియాలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. షారుఖ్ ఖాన్, కంగనా రనౌత్, రణవీర్ సింగ్ తదితరులతో సినిమా చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి ఆర్టిస్టులు సందీప్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని తెలిపారు సందీప్ రెడ్డి.

సందీప్ రెడ్డి వంగ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.